Nememi neṟamgamu nijamani vumdudumu

నేమేమి నెఱఁగము నిజమని వుండుదుము
Language

(॥పల్లవి॥)
నేమేమి నెఱఁగము నిజమని వుండుదుము
నీ మహిమలెల్లాను నీకే తెలుసును

(॥నేమే॥)
తగవులు చెప్పేవు తరుణులకును మాకు
నగవులు నవ్వేవు నయగారాల
మొగములు చూచేవు మూఁకమీఁదనెల్లాను
యెగసక్కెపునీమోహ మెవ్వతెపై నున్నదో

(॥నేమే॥)
అసలెల్లాఁ బెట్టేవు అండఁ గూచుండుమనేవు
వేసార కందరికిని విడేలిచ్చేవు
సేసలు పైఁ జల్లేవు చేతులు సారెఁ జాంచేవు
వాసిగా నెవ్వరిమీఁద వలపు నీకున్నదో

(॥నేమే॥)
పాదాలు పైఁ జాంచేవు బాగుగ నొత్తుమనేవు
కైదండలు పట్టుకొని కాఁగిలించేవు
యీదెస శ్రీవేంకటేశ యే నలమేలు మంగను
పోదితో నన్నేలితివి పొందు లిఁకెందున్నవో

(||pallavi||)
nememi nĕṟam̐gamu nijamani vuṁḍudumu
nī mahimalĕllānu nīge tĕlusunu

(||neme||)
tagavulu sĕppevu taruṇulagunu māgu
nagavulu navvevu nayagārāla
mŏgamulu sūsevu mūm̐kamīm̐danĕllānu
yĕgasakkĕbunīmoha mĕvvadĕbai nunnado

(||neme||)
asalĕllām̐ bĕṭṭevu aṁḍam̐ gūsuṁḍumanevu
vesāra kaṁdarigini viḍelichchevu
sesalu paim̐ jallevu sedulu sārĕm̐ jāṁchevu
vāsigā nĕvvarimīm̐da valabu nīgunnado

(||neme||)
pādālu paim̐ jāṁchevu bāguga nŏttumanevu
kaidaṁḍalu paṭṭugŏni kām̐giliṁchevu
yīdĕsa śhrīveṁkaḍeśha ye nalamelu maṁganu
podido nannelidivi pŏṁdu lim̐kĕṁdunnavo