నేఁడు గొత్తలా నాకు నీ సుద్దులు
(॥పల్లవి॥)
నేఁడు గొత్తలా నాకు నీ సుద్దులు
వేఁడి చూపితే వెన్న వేవేగఁ గరఁగదా
(॥నేడు॥)
కొసరక నీ చేఁతలు గుట్టుసేయవలెఁగాక
పిసికితేఁ గడుఁగడుఁ బసురుగాదా
పొసఁగ నీ గుణములు పొగడఁగ వలెఁగాక
ముసుఁగులు వెట్టితేను ముగ్గు వేయదా
(॥నేడు॥)
పాయరానినీ మాటల బయలీఁదవలెఁగాక
నాయానకుఁ దీసితేను నాముకొనదా
చాయలకు నీ ప్రియము చవిగొనవలెఁగాక
రాయడించ జూచితేను రాఁపుకెక్కదా
(॥నేడు॥)
కూడిననీకూటములు కూడపోయవలెఁగాక
ఆడా నీడా నెరపితే నంటుకొనదా
యీడనె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
ఆడుకొనఁబోయితే నానందము గాదా
(||pallavi||)
nem̐ḍu gŏttalā nāgu nī suddulu
vem̐ḍi sūbide vĕnna vevegam̐ garam̐gadā
(||neḍu||)
kŏsaraga nī sem̐talu guṭṭuseyavalĕm̐gāga
pisigidem̐ gaḍum̐gaḍum̐ basurugādā
pŏsam̐ga nī guṇamulu pŏgaḍam̐ga valĕm̐gāga
musum̐gulu vĕṭṭidenu muggu veyadā
(||neḍu||)
pāyarāninī māḍala bayalīm̐davalĕm̐gāga
nāyānagum̐ dīsidenu nāmugŏnadā
sāyalagu nī priyamu savigŏnavalĕm̐gāga
rāyaḍiṁcha jūsidenu rām̐pugĕkkadā
(||neḍu||)
kūḍinanīgūḍamulu kūḍaboyavalĕm̐gāga
āḍā nīḍā nĕrabide naṁṭugŏnadā
yīḍanĕ śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
āḍugŏnam̐boyide nānaṁdamu gādā