Nemaligi nerbina nadagalivi

నెమలికి నేర్పిన నడకలివి
Work
Year
Language

పల్లవి:

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్యలీల....

చరణం 1:

కలహంసలకిచ్చిన పదగతులు
ఎలకోయిల మెచ్చిన స్వరజతులు !!2!!

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవో కన్నుల కిన్నెరలు !!2!!

కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన
కాళిదాసు కమనీయ కల్పనానల్ప
శిల్ప మణి మేఖలను
శకుంతలను....

చరణం 2:

చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ దీపికలు !!2!!

నీలాల కన్నుల్లో తారకలు
తారాడే చూపుల్లో చంద్రికలు !!2!!

కురులు విరిసి
మరులు కురుసి మురిసిన
రవివర్మ చిత్రలేఖనా లేఖ్య
సరస సౌందర్య రేఖను
శశిరేఖను....

pallavi:

nĕmaligi nerbina naḍagalivi
muraḽigi aṁdani palugulivi
śhṛṁgāra saṁgīda nṛtyābhinayaveḽa
sūḍāli nā nāṭyalīla....

saraṇaṁ 1:

kalahaṁsalagichchina padagadulu
ĕlagoyila mĕchchina svarajadulu !!2!!

ĕnnĕnno vannĕla vĕnnĕlalu
evevo kannula kinnĕralu !!2!!

kalisi mĕlisi kaḽalu virisi mĕrisina
kāḽidāsu kamanīya kalbanānalba
śhilba maṇi mekhalanu
śhaguṁtalanu....

saraṇaṁ 2:

sirunavvulu abhinava malligalu
sirimuvvalu abhinaya dībigalu !!2!!

nīlāla kannullo tāragalu
tārāḍe sūbullo saṁdrigalu !!2!!

kurulu virisi
marulu kurusi murisina
ravivarma sitralekhanā lekhya
sarasa sauṁdarya rekhanu
śhaśhirekhanu....