నేమా యెఱఁగ మిందుకు! వేంకటేశ!
(॥పల్లవి॥)
నేమా యెఱఁగ మిందుకు! వేంకటేశ!
నేమా యెఱఁగ మిందుకు
నేమము దలఁచుకొని నిలు నిలు మిఁకను
(॥నేమా॥)
సారెకు నిన్నుఁ జూచితే జంకించనే బుద్దివుట్టీ
చేరి చేరి నీవు నన్నుఁ జేసే చేఁతకు
ధీరత నీవు నవ్వితే తిట్లు నోటికి వచ్చీ
వూరకుండు చాలుఁజాలు వొద్దు వొద్దు ఇఁకను
(॥నేమా॥)
సందడిఁ బెనఁగఁబోతే చన్నులకు వాండెక్కీ
చిందరవందర నీవు సేసే చేఁతకు
అందాలు చెప్పఁగఁబోతే అపనమ్మికలే తోఁచీ
పొందే ఆన లెన్నిలేవు పోకు పోకు మిఁకను
(॥నేమా॥)
కుచ్చి కాఁగిలించుకుంటే కోరికులు దైవారీ
చెచ్చెర నీవు రతులఁ జేసే చేఁతకు
యిచ్చట శ్రీ వేంకటేశ యెనసితి మిద్దరము
విచ్చన విడాయ మంకు విడువిడు మిఁకను
(||pallavi||)
nemā yĕṟam̐ga miṁdugu! veṁkaḍeśha!
nemā yĕṟam̐ga miṁdugu
nemamu dalam̐sugŏni nilu nilu mim̐kanu
(||nemā||)
sārĕgu ninnum̐ jūside jaṁkiṁchane buddivuṭṭī
seri seri nīvu nannum̐ jese sem̐tagu
dhīrada nīvu navvide tiṭlu noḍigi vachchī
vūraguṁḍu sālum̐jālu vŏddu vŏddu im̐kanu
(||nemā||)
saṁdaḍim̐ bĕnam̐gam̐bode sannulagu vāṁḍĕkkī
siṁdaravaṁdara nīvu sese sem̐tagu
aṁdālu sĕppam̐gam̐bode abanammigale tom̐sī
pŏṁde āna lĕnnilevu pogu pogu mim̐kanu
(||nemā||)
kuchchi kām̐giliṁchuguṁṭe korigulu daivārī
sĕchchĕra nīvu radulam̐ jese sem̐tagu
yichchaḍa śhrī veṁkaḍeśha yĕnasidi middaramu
vichchana viḍāya maṁku viḍuviḍu mim̐kanu