Nemaa vinnavimchidimi nee sittamu

నేమా విన్నవించితిమి నీ చిత్తము
Language

(॥పల్లవి॥)
నేమా విన్నవించితిమి నీ చిత్తము
కామిని భావము చూచి కరుణించు మిఁకను

(॥నేమా॥)
అడయీసఁ గొంతవద్దు అట్టె నీవు వచ్చేవనే
తడఁబాటుతోడి చింత గొంతవొద్దు
యెడమాట లాడించే ఇంకాఁ బొద్దు జరపే
బడలెఁ జెలియ ఇఁకఁ బట్టలేదు మనసు

(॥నేమా॥)
వేడుకలఁ గొంతవొద్దు వెస నీ కెదురుచూచి
కూడేనని తమితోడఁ గొంతవొద్దు
పాడుచు నీపైఁబాటలు బలుమారు వొద్దువుచ్చె
వోడక గుట్టుననుండి వోర్వలేదు తాపము

(॥నేమా॥)
వినుకలిఁ గొంతవొద్దు వేగ నీవు మన్నించి చే
కొని కాఁగిలించఁగాను కొంతవొద్దు
యెనసితివి శ్రీవేకేంటేశ ఇంతలో నీకెను
తనిసె నిన్నిటా నిఁకఁ దడవదు నేరమి

(||pallavi||)
nemā vinnaviṁchidimi nī sittamu
kāmini bhāvamu sūsi karuṇiṁchu mim̐kanu

(||nemā||)
aḍayīsam̐ gŏṁtavaddu aṭṭĕ nīvu vachchevane
taḍam̐bāḍudoḍi siṁta gŏṁtavŏddu
yĕḍamāḍa lāḍiṁche iṁkām̐ bŏddu jarabe
baḍalĕm̐ jĕliya im̐kam̐ baṭṭaledu manasu

(||nemā||)
veḍugalam̐ gŏṁtavŏddu vĕsa nī kĕdurusūsi
kūḍenani tamidoḍam̐ gŏṁtavŏddu
pāḍusu nībaim̐bāḍalu balumāru vŏdduvuchchĕ
voḍaga guṭṭunanuṁḍi vorvaledu tābamu

(||nemā||)
vinugalim̐ gŏṁtavŏddu vega nīvu manniṁchi se
kŏni kām̐giliṁcham̐gānu kŏṁtavŏddu
yĕnasidivi śhrīvegeṁṭeśha iṁtalo nīgĕnu
tanisĕ ninniḍā nim̐kam̐ daḍavadu nerami