Nelaraajaa parugidagu...seli vese naagoragu

నెలరాజా పరుగిడకు...చెలి వేచే నాకొరకు
Year
Language

పల్లవి:

నెలరాజా పరుగిడకు
చెలి వేచే నాకొరకు
ఒక్కమారు పోయి
చెలినిగాంచుమా
నివేదించుమా విరహమే ||2||

నెలరాజా పరుగిడకు
చెలి వేచే నాకొరకు

చరణం 1:

మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం
ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి అందం ||2||

వాడిపోనిదీ వనిత యవ్వనం
ఆడిపాడితే కనుల నందనం
అణువణువు విరిసేలే లావణ్యం

చరణం 2:

ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ ||2||

కొండవాగులా మల్లెతీగలా
పులకరించినా సన్నజాజిలా
విరహిణిలా వేచేను జవరాలే

pallavi:

nĕlarājā parugiḍagu
sĕli vese nāgŏragu
ŏkkamāru poyi
sĕlinigāṁchumā
nivediṁchumā virahame ||2||

nĕlarājā parugiḍagu
sĕli vese nāgŏragu

saraṇaṁ 1:

mabbulalo taḽugumane mĕrubele sĕli aṁdaṁ
muchchaḍagā mutyaṁ lā mĕrisibaḍe sakhi aṁdaṁ ||2||

vāḍibonidī vanida yavvanaṁ
āḍibāḍide kanula naṁdanaṁ
aṇuvaṇuvu virisele lāvaṇyaṁ

saraṇaṁ 2:

muṁgiḍane rāsilugā paligenū svāgadamu
muribĕmugā tama rāgā nā sĕlido tĕlibenū ||2||

kŏṁḍavāgulā mallĕdīgalā
pulagariṁchinā sannajājilā
virahiṇilā vesenu javarāle