Nelamta nimtadam garunimchavayyaa

నెలఁత నింతటఁ గరుణించవయ్యా
Language

(॥పల్లవి॥)
నెలఁత నింతటఁ గరుణించవయ్యా
కలికి గుబ్బచన్నులు కానుకగా నిచ్చీని

(॥నెలఁ॥)
వెక్కసపుఁ దమకము విన్నవించ సిగ్గువడి
చెక్కు చెమటలు గోరఁ జిమ్మీ నీపై
చొక్కిన నివ్వెరగులు చూపి సొలయఁజాలక
ముక్కున నిట్టూర్పులు ముంచి పోసీని

(॥నెలఁ॥)
వుప్పతిలు విరహము వోలి నెచ్చరించరాక
కొప్పులో వాడుఁబువ్వులు గుప్పీ నీపై
దప్పిదేరే యలపులు తారుకాణించనోపక
లప్పలచిట్టు గందాల లాచివేసీని

(॥నెలఁ॥)
మునుపతి నీ పొందులు ముదులకించఁగలేక
ననలైన పులకలు నాఁటించీనీపై
యెనసితివి శ్రీవేంకటే యిప్పుడే యీకెను
వినయాన మోవితేనె విందులు సేసీని

(||pallavi||)
nĕlam̐ta niṁtaḍam̐ garuṇiṁchavayyā
kaligi gubbasannulu kānugagā nichchīni

(||nĕlam̐||)
vĕkkasabum̐ damagamu vinnaviṁcha sigguvaḍi
sĕkku sĕmaḍalu goram̐ jimmī nībai
sŏkkina nivvĕragulu sūbi sŏlayam̐jālaga
mukkuna niṭṭūrbulu muṁchi posīni

(||nĕlam̐||)
vuppadilu virahamu voli nĕchchariṁcharāga
kŏppulo vāḍum̐buvvulu guppī nībai
dappidere yalabulu tārugāṇiṁchanobaga
lappalasiṭṭu gaṁdāla lāsivesīni

(||nĕlam̐||)
munubadi nī pŏṁdulu mudulagiṁcham̐galega
nanalaina pulagalu nām̐ṭiṁchīnībai
yĕnasidivi śhrīveṁkaḍe yippuḍe yīgĕnu
vinayāna movidenĕ viṁdulu sesīni