(॥పల్లవి॥)
నెలఁత మేని యలపు నీదిగాదా
లలి నివియల్లాఁ జూచి లాలించవలదా
(॥నెలఁ॥)
వలపులవసివాడు వనితకు నుండఁగాను
చలము లింకానేల సరసుఁడవు
చెలసచెమటలు చెక్కులపై నుండఁగాను
కలఇకరతులను కరుణించవలదా
(॥నెలఁ॥)
వెడయాస పులకలు వెలఁదికి నుండఁగాను
బెడసుఁబరాకులేల ప్రియుఁడవు
తడఁడేతమకముతలఁపులో నుండఁగాను
అడరిమోవి ఇచ్చి ఆదరించవలదా
(॥నెలఁ॥)
కూడినసంతోసము కోమలికి నుండఁగాను
గాడఁబెట్టనేల శ్రీవేంకటేశుఁడవు
వోడక నిట్టూర్పులు వొగిఁ బుక్కిట నుండఁగ
నీడలను నిలిచి మననించఁగవలదా
(||pallavi||)
nĕlam̐ta meni yalabu nīdigādā
lali niviyallām̐ jūsi lāliṁchavaladā
(||nĕlam̐||)
valabulavasivāḍu vanidagu nuṁḍam̐gānu
salamu liṁkānela sarasum̐ḍavu
sĕlasasĕmaḍalu sĕkkulabai nuṁḍam̐gānu
kala̮igaradulanu karuṇiṁchavaladā
(||nĕlam̐||)
vĕḍayāsa pulagalu vĕlam̐digi nuṁḍam̐gānu
bĕḍasum̐barāgulela priyum̐ḍavu
taḍam̐ḍedamagamudalam̐pulo nuṁḍam̐gānu
aḍarimovi ichchi ādariṁchavaladā
(||nĕlam̐||)
kūḍinasaṁtosamu komaligi nuṁḍam̐gānu
gāḍam̐bĕṭṭanela śhrīveṁkaḍeśhum̐ḍavu
voḍaga niṭṭūrbulu vŏgim̐ bukkiḍa nuṁḍam̐ga
nīḍalanu nilisi mananiṁcham̐gavaladā