Neeyichchalodaana nenu nee yidave soodumgaaga

నీయిచ్చలోదాన నేను నీ యితవే చూతుఁగాక
Language

(॥పల్లవి॥)
నీయిచ్చలోదాన నేను నీ యితవే చూతుఁగాక
ఆ యింతిని మారుకొన నరుదా నాకు

(॥నీయి॥)
యెలమి నీచిత్త మెప్పు డెట్టుండునో అనికాక
నెలఁతతోఁ బంతమాడనేరనా నేను
చెలికి నేమేమి బాసచేసితివో అనికాక
తలకొని మట్టుపెట్టఁదడవా నాకు

(॥నీయి॥)
యీసతిపై నే మోహ మెంతగద్దో అని కాక
వూసివాసు లెంచి మీరనోపనా నేను
వేసటతో నీమోము విన్ననౌనో అనికాక
తోసి యాపెయెమ్మె మాన్పదొడ్డా నాకు

(॥నీయి॥)
చెలఁగి నీవేడుకలు చెల్లింతు ననికాక
యలయిం చాపెను గెల్వ నెదురా నాకు
అలమేల్ మంగనే నేను అట్టె శ్రీవేంకటేశుడ
కలసితాపెను సాటిగలదా నాకు

(||pallavi||)
nīyichchalodāna nenu nī yidave sūdum̐gāga
ā yiṁtini mārugŏna narudā nāgu

(||nīyi||)
yĕlami nīsitta mĕppu ḍĕṭṭuṁḍuno anigāga
nĕlam̐tadom̐ baṁtamāḍaneranā nenu
sĕligi nememi bāsasesidivo anigāga
talagŏni maṭṭubĕṭṭam̐daḍavā nāgu

(||nīyi||)
yīsadibai ne moha mĕṁtagaddo ani kāga
vūsivāsu lĕṁchi mīranobanā nenu
vesaḍado nīmomu vinnanauno anigāga
tosi yābĕyĕmmĕ mānpadŏḍḍā nāgu

(||nīyi||)
sĕlam̐gi nīveḍugalu sĕlliṁtu nanigāga
yalayiṁ sābĕnu gĕlva nĕdurā nāgu
alamel maṁgane nenu aṭṭĕ śhrīveṁkaḍeśhuḍa
kalasidābĕnu sāḍigaladā nāgu