Neeyamdune kamtimi nettugonna mamkulella

నీయందునే కంటిమి నెట్టుకొన్న మంకులెల్ల
Language

(॥పల్లవి॥)
నీయందునే కంటిమి నెట్టుకొన్న మంకులెల్ల
వాయెత్తితేఁ గోరుగొనేవారు గలరా

(॥నీయం॥)
పంతము లేమిటికే బలువుఁడాతఁడు నీకు
అంతట నింతటనుఁ బ్రియాలు చెప్పఁగా
బంతినే దయదలఁచి పాలుఁగూడుఁ బెట్టితేను
వంతులకు నోకిలించేవారు గలరా

(॥నీయం॥)
కోపము లేమిటికే కోడెకాఁడతఁడు నీకు
చేపట్టి నవ్వులు నవ్వి చెక్కునొక్కఁగా
యేపుల నిధానము యెదురుకట్ల నుంటే
వైపుల మారుమోమయ్యేవారు గలరా

(॥నీయం॥)
సిగ్గులు నీకేఁటికే శ్రీ వేంకటేశ్వరుఁడు
దగ్గరి కాఁగిటఁగూడి తమకించఁగా
వొగ్గిన రతులలోన వూరకైనా వలపులు
వగ్గరించి చవిగొనేవారు గలరా

(||pallavi||)
nīyaṁdune kaṁṭimi nĕṭṭugŏnna maṁkulĕlla
vāyĕttidem̐ gorugŏnevāru galarā

(||nīyaṁ||)
paṁtamu lemiḍige baluvum̐ḍādam̐ḍu nīgu
aṁtaḍa niṁtaḍanum̐ briyālu sĕppam̐gā
baṁtine dayadalam̐si pālum̐gūḍum̐ bĕṭṭidenu
vaṁtulagu nogiliṁchevāru galarā

(||nīyaṁ||)
kobamu lemiḍige koḍĕgām̐ḍadam̐ḍu nīgu
sebaṭṭi navvulu navvi sĕkkunŏkkam̐gā
yebula nidhānamu yĕdurugaṭla nuṁṭe
vaibula mārumomayyevāru galarā

(||nīyaṁ||)
siggulu nīgem̐ṭige śhrī veṁkaḍeśhvarum̐ḍu
daggari kām̐giḍam̐gūḍi tamagiṁcham̐gā
vŏggina radulalona vūragainā valabulu
vaggariṁchi savigŏnevāru galarā