నీవుండే దా కొండపై నాస్వామి ! నేనుండే
పల్లవి:
నీవుండే దా కొండపై
నాస్వామి ! నేనుండే దీ నేలపై
ఏ లీల సేవింతునో ఓ ఓ ఒ.. ఏ పూల పూజింతునో !
చరణం 1:
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే
ఈ పేదరాలి మనస్సెంతో వేచే ||2||
నీ పాదసేవా మహాభాగ్య మీవా
నాపైనే దయజూపవా నాస్వామీ
చరణం 2:
దూరాన నైనా కనే భాగ్య మీవా
నీ రూపు నాలో సదా నిల్పనీవా ||2||
ఏడు కొండలపైనా వీడైన స్వామి
నాపైనే దయజూపవా నాస్వామీ
pallavi:
nīvuṁḍe dā kŏṁḍabai
nāsvāmi ! nenuṁḍe dī nelabai
e līla seviṁtuno o o ŏ.. e pūla pūjiṁtuno !
saraṇaṁ 1:
śhrī pārijāda sumālĕnno pūse
ī pedarāli manassĕṁto vese ||2||
nī pādasevā mahābhāgya mīvā
nābaine dayajūbavā nāsvāmī
saraṇaṁ 2:
dūrāna nainā kane bhāgya mīvā
nī rūbu nālo sadā nilbanīvā ||2||
eḍu kŏṁḍalabainā vīḍaina svāmi
nābaine dayajūbavā nāsvāmī