నీవుగలచోటనే యన్నియుఁ గలవు
(॥పల్లవి॥)
నీవుగలచోటనే యన్నియుఁ గలవు
చేవదేరీ నీ మేన సింగారాలన్నియును
(॥నీవు॥)
నిమ్మపండు కానుకగా నీవేమి ఇచ్చేవే చెలి
నిమ్మపండ్లంతలే కావా నీ చన్నులు
తమ్మిపువ్వు లెల్లాను తలనేలముడిచేవే
తమ్మివువ్వులే నీహస్తములు గావా
(॥నీవు॥)
చిలుక ముంజేతఁబట్టి చేరి పలికించనేలే
చిలుకపలుకే కాదా చెలి నీమాఁట
కొలువు సేసేవేమే కోరి వేఁడినంగజుని
కొలువుకూటమే కాదా కొమ్మరో నీ కాఁగిలి
(॥నీవు॥)
చిగురుల నేల వేసేవే నీవు పలుమారు
చిగురువంటిదే కాదా చెలి నీమేను
జిగి నన్నుఁ గూడేవేమే శ్రీవేంకటేశుఁడనని
జిగిబిగి పొందులే మంచి కూటమి గాదా
(||pallavi||)
nīvugalasoḍane yanniyum̐ galavu
sevaderī nī mena siṁgārālanniyunu
(||nīvu||)
nimmabaṁḍu kānugagā nīvemi ichcheve sĕli
nimmabaṁḍlaṁtale kāvā nī sannulu
tammibuvvu lĕllānu talanelamuḍiseve
tammivuvvule nīhastamulu gāvā
(||nīvu||)
siluga muṁjedam̐baṭṭi seri paligiṁchanele
silugabaluge kādā sĕli nīmām̐ṭa
kŏluvu seseveme kori vem̐ḍinaṁgajuni
kŏluvugūḍame kādā kŏmmaro nī kām̐gili
(||nīvu||)
sigurula nela veseve nīvu palumāru
siguruvaṁṭide kādā sĕli nīmenu
jigi nannum̐ gūḍeveme śhrīveṁkaḍeśhum̐ḍanani
jigibigi pŏṁdule maṁchi kūḍami gādā