Neevu sesinatti maayo ne valasina valabo

నీవు సేసినట్టి మాయో నే వలచిన వలపో
Language

(॥పల్లవి॥)
నీవు సేసినట్టి మాయో నే వలచిన వలపో
చేవలు మీరి యుండుదు సిగ్గువడ నిపుడు

(॥నీవు॥)
అలుగ మనసురాదు అట్టె నీవేమి సేసినా
పిలుతు సారెకు నిన్నుఁ బేరుకొనుచు
తొలఁగ మనసు రాదు దొమ్మి నీవు సేసితేను
నిలుచుందు నీ యెదుట నీచేతికి లోనై

(॥నీవు॥)
వెంగెమాడఁ గొలుపదు వింతలే నీవెట్టుండినా
సంగతిగా నవ్వుదును సరసమాడి
కంగువెట్టఁ గొలుపదు గర్వముతో నీవుండితే
యెంగిలిమోవి యడిగి ఇచ్చకమే సేతును

(॥నీవు॥)
పంతమాడ సొగయదు పైకొని నీవు గూడితే
సంతోసాలే పుట్టింతు సారె సారెకు
ఇంతట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
మంతనాలే ఆడుదు మచ్చిక దైవారును

(||pallavi||)
nīvu sesinaṭṭi māyo ne valasina valabo
sevalu mīri yuṁḍudu sigguvaḍa nibuḍu

(||nīvu||)
aluga manasurādu aṭṭĕ nīvemi sesinā
piludu sārĕgu ninnum̐ berugŏnusu
tŏlam̐ga manasu rādu dŏmmi nīvu sesidenu
nilusuṁdu nī yĕduḍa nīsedigi lonai

(||nīvu||)
vĕṁgĕmāḍam̐ gŏlubadu viṁtale nīvĕṭṭuṁḍinā
saṁgadigā navvudunu sarasamāḍi
kaṁguvĕṭṭam̐ gŏlubadu garvamudo nīvuṁḍide
yĕṁgilimovi yaḍigi ichchagame sedunu

(||nīvu||)
paṁtamāḍa sŏgayadu paigŏni nīvu gūḍide
saṁtosāle puṭṭiṁtu sārĕ sārĕgu
iṁtaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
maṁtanāle āḍudu machchiga daivārunu