Neevu sesinade semta nee nagari lobalanu

నీవు సేసినదే చేఁత నీ నగరి లోపలను
Language

(॥పల్లవి॥)
నీవు సేసినదే చేఁత నీ నగరి లోపలను
ఆవటించ నేమిటికి అనుమానా లిఁకను

(॥నీవు॥)
కాతరించి ఆపె నీకు కమ్మి కొలువులోనుండి
చేతులెత్తి మొక్కేదే సెలవా నీకు
పోతరాన మేను సోఁక పొందులు సేయఁగరాదా
యీతలఁ గాదనేవారు యెవ్వరు నిన్నిఁకను

(॥నీవు॥)
కమ్మి నీవూడిగమున కాళాఁజి వట్టుకొని
చిమ్ముచుఁ జూచినదే సెలవా నీకు
కుమ్మరించి యాపె లోనికోరిక దీరుచరాదా
చొమ్మెల నింతలో వెలిఁబుట్టీనా యీసుద్దులు

(॥నీవు॥)
తమకించి యేకతాన దగ్గరిమేరలుమీరి
చెమటలు నించినదే సెలవా నీకు
అమర శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
జమళి నీవలపులు సరిదాఁకె నిప్పడు

(||pallavi||)
nīvu sesinade sem̐ta nī nagari lobalanu
āvaḍiṁcha nemiḍigi anumānā lim̐kanu

(||nīvu||)
kādariṁchi ābĕ nīgu kammi kŏluvulonuṁḍi
sedulĕtti mŏkkede sĕlavā nīgu
podarāna menu som̐ka pŏṁdulu seyam̐garādā
yīdalam̐ gādanevāru yĕvvaru ninnim̐kanu

(||nīvu||)
kammi nīvūḍigamuna kāḽām̐ji vaṭṭugŏni
simmusum̐ jūsinade sĕlavā nīgu
kummariṁchi yābĕ lonigoriga dīrusarādā
sŏmmĕla niṁtalo vĕlim̐buṭṭīnā yīsuddulu

(||nīvu||)
tamagiṁchi yegadāna daggarimeralumīri
sĕmaḍalu niṁchinade sĕlavā nīgu
amara śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
jamaḽi nīvalabulu saridām̐kĕ nippaḍu