నీవు చేపట్టఁగాఁ గాక నే నిన్నాళ్లుఁ గొసరేనా
(॥పల్లవి॥)
నీవు చేపట్టఁగాఁ గాక నే నిన్నాళ్లుఁ గొసరేనా
వావులు చేకొన్నమీఁద వరుస నీ చేతిది
(॥నీవు॥)
చింతతో నే నుండఁగాను చెలులెల్ల నవ్వఁగాను
యెంత కెంత సేసేవు నీ కేమి గూడెనో
బంతినే నీకు మొక్కితి భవమెల్లా నీకిచ్చితి
పొంతల నిఁక మీఁదటి పుణ్యము నీచేతిది
(॥నీవు॥)
కాఁకలతో నేనుండఁగా కడవారు మొరయఁగ
యేఁకట నూరకున్నాఁడ విది యేఁటిది
సోఁకఁగ నీ సొమ్మ నేను సొలసి సేవ సేసితి
ఆఁ కలరతులలోనిఆయము నీ చేతిది
(॥నీవు॥)
నివ్వెరగుతో నుండఁగ నీ సతు లిచ్చలాడఁగ
చివ్వన నన్ను మన్నించే చిత్త మెన్నఁడు
ఇవ్వల శ్రీ వేంకటేశ యెనసితి మిద్దరము
జవ్వనపు విభవాల సరవి నీ చేతిది
(||pallavi||)
nīvu sebaṭṭam̐gām̐ gāga ne ninnāḽlum̐ gŏsarenā
vāvulu segŏnnamīm̐da varusa nī sedidi
(||nīvu||)
siṁtado ne nuṁḍam̐gānu sĕlulĕlla navvam̐gānu
yĕṁta kĕṁta sesevu nī kemi gūḍĕno
baṁtine nīgu mŏkkidi bhavamĕllā nīgichchidi
pŏṁtala nim̐ka mīm̐daḍi puṇyamu nīsedidi
(||nīvu||)
kām̐kalado nenuṁḍam̐gā kaḍavāru mŏrayam̐ga
yem̐kaḍa nūragunnām̐ḍa vidi yem̐ṭidi
som̐kam̐ga nī sŏmma nenu sŏlasi seva sesidi
ām̐ kalaradulaloniāyamu nī sedidi
(||nīvu||)
nivvĕragudo nuṁḍam̐ga nī sadu lichchalāḍam̐ga
sivvana nannu manniṁche sitta mĕnnam̐ḍu
ivvala śhrī veṁkaḍeśha yĕnasidi middaramu
javvanabu vibhavāla saravi nī sedidi