నీవు సరసుఁడవు నే నీవూడిగపుదాన
(॥పల్లవి॥)
నీవు సరసుఁడవు నే నీవూడిగపుదాన
భావించి నీ చిత్తము పట్టరాక కాక
(॥॥)
వొడివట్టితియ్యఁగా నే నోపననేదాననా
అడరి మందెమేళము లౌనని కాక
తడవి చెనకఁ గాను తప్పించుకొనేనా
సుడిసి కొనగో రెందుసోఁకునో యనికాక
(॥॥)
తగిలి నీవు చూడఁగాఁ దలవంచేదాననా
వొగి నీతో గర్వమని వుందానఁ గాక
పగటున నవ్వఁ గాను పరాకయ్యేదాననా
చిగిరించేనా లోని సిగ్గులకుఁ గాక
(॥॥)
సరసములాడఁ గాను సమ్మతించనిదాననా
సరికి బేసికి నీతో జరయఁ గాక
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
వొరసి నానీమన్నన నొద్దికయ్యేఁ గాక
(||pallavi||)
nīvu sarasum̐ḍavu ne nīvūḍigabudāna
bhāviṁchi nī sittamu paṭṭarāga kāga
(||||)
vŏḍivaṭṭidiyyam̐gā ne nobananedānanā
aḍari maṁdĕmeḽamu launani kāga
taḍavi sĕnagam̐ gānu tappiṁchugŏnenā
suḍisi kŏnago rĕṁdusom̐kuno yanigāga
(||||)
tagili nīvu sūḍam̐gām̐ dalavaṁchedānanā
vŏgi nīdo garvamani vuṁdānam̐ gāga
pagaḍuna navvam̐ gānu parāgayyedānanā
sigiriṁchenā loni siggulagum̐ gāga
(||||)
sarasamulāḍam̐ gānu sammadiṁchanidānanā
sarigi besigi nīdo jarayam̐ gāga
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
vŏrasi nānīmannana nŏddigayyem̐ gāga