నీవు నన్ను నేలినది నేఁడు తా నెఱఁగదేమో
(॥పల్లవి॥)
నీవు నన్ను నేలినది నేఁడు తా నెఱఁగదేమో
పూవుల వేసీ నిన్నుఁ బొంచిపొంచి యిపుడు
(॥నీవు॥)
చెక్కు కొనగోర నొక్కి చిమ్మిరేఁగ వేఁడుకొని
అక్కరతో విడెమిచ్చీ నంగన నీకు
జక్కవ చన్నుల నూఁది చవులుగా మోవితేనె
పుక్కిట బంటి గాఁగఁ బోసీ వేడుకను
(॥నీవు॥)
వొడివట్టుకొని నీతో నుబ్బరిమాఁట లాడీ
వడిగా నవ్వులు నవ్వీ వాడికగాను
తొడమీఁదఁ దొడవేసి తొరలించి వలపులు
జడివానలుగ నీపైఁ జల్లీ సరసము
(॥నీవు॥)
నెమ్మదిఁ గాఁగిట నించి నేరుపులు వచరించి
వుమ్మడి రతులఁ గూడీ వొద్దికతోను
యిమ్ముల శ్రీవేంకటేశ యెదురెదురనే యీకె
కుమ్మరించీ నీపైఁ బ్తతి కోరికలు మీరను
(||pallavi||)
nīvu nannu nelinadi nem̐ḍu tā nĕṟam̐gademo
pūvula vesī ninnum̐ bŏṁchibŏṁchi yibuḍu
(||nīvu||)
sĕkku kŏnagora nŏkki simmirem̐ga vem̐ḍugŏni
akkarado viḍĕmichchī naṁgana nīgu
jakkava sannula nūm̐di savulugā movidenĕ
pukkiḍa baṁṭi gām̐gam̐ bosī veḍuganu
(||nīvu||)
vŏḍivaṭṭugŏni nīdo nubbarimām̐ṭa lāḍī
vaḍigā navvulu navvī vāḍigagānu
tŏḍamīm̐dam̐ dŏḍavesi tŏraliṁchi valabulu
jaḍivānaluga nībaim̐ jallī sarasamu
(||nīvu||)
nĕmmadim̐ gām̐giḍa niṁchi nerubulu vasariṁchi
vummaḍi radulam̐ gūḍī vŏddigadonu
yimmula śhrīveṁkaḍeśha yĕdurĕdurane yīgĕ
kummariṁchī nībaim̐ btadi korigalu mīranu