Neevu nannu daggarude neramaayamgaa

నీవు నన్ను దగ్గరుటే నేరమాయఁగా
Language

(॥పల్లవి॥)
నీవు నన్ను దగ్గరుటే నేరమాయఁగా
కావిరి నీ సుద్దులెల్ల కతలాయఁగా

(॥నీవు॥)
తొలఁగి కడలు నీవు తొక్కివచ్చినట్టివేళ
సెలవి నానవ్వు నీకుఁ జేఁదాయఁగా
పలుచేఁతలను నీమై వచ్చియైనయీవేళ
కలికినాకనుచూపే కారమాయఁగా

(॥నీవు॥)
యెంచఁగ వేరొకతెతో నేకతమైవున్నవేళ
వంచిననామొక్కు నీకు వాఁడాయఁగా
నించి రాత్రిజాగరాలు నీవు నిద్రించేవేళ
పొంచిననామట నీకు పులుసాయఁగా

(॥నీవు॥)
కందువకాఁగిటఁ గూడి కరఁగివుండేవేళ
సందడి నాకొనగోరే చవులాయఁగా
ఇందునందు శ్రీవేంకటేశ నన్నుఁ గూడఁగాను
చందపువపులలెల్లా సతమాయఁగా

(||pallavi||)
nīvu nannu daggaruḍe neramāyam̐gā
kāviri nī suddulĕlla kadalāyam̐gā

(||nīvu||)
tŏlam̐gi kaḍalu nīvu tŏkkivachchinaṭṭiveḽa
sĕlavi nānavvu nīgum̐ jem̐dāyam̐gā
palusem̐talanu nīmai vachchiyainayīveḽa
kaligināganusūbe kāramāyam̐gā

(||nīvu||)
yĕṁcham̐ga verŏgadĕdo negadamaivunnaveḽa
vaṁchinanāmŏkku nīgu vām̐ḍāyam̐gā
niṁchi rātrijāgarālu nīvu nidriṁcheveḽa
pŏṁchinanāmaḍa nīgu pulusāyam̐gā

(||nīvu||)
kaṁduvagām̐giḍam̐ gūḍi karam̐givuṁḍeveḽa
saṁdaḍi nāgŏnagore savulāyam̐gā
iṁdunaṁdu śhrīveṁkaḍeśha nannum̐ gūḍam̐gānu
saṁdabuvabulalĕllā sadamāyam̐gā