నీవు నాతోనైతేను నిజములే నెరపేవు
(॥పల్లవి॥)
నీవు నాతోనైతేను నిజములే నెరపేవు
భావించితే నీ వొళ్లనే పచ్చిదేరీఁ జేఁతలు
(॥నీవు॥)
అప్పుడు నీవు నేను వాడుకొన్న మాటలెల్లా
చెప్పె నీకె నాతోను చెలరేఁగును
నెప్పునఁ బొంచువినెనో నీ వెరుక సేసితివో
చొప్పులెత్తే యీకెఁ జూచి సోద్యమయ్యీ నాకు
(॥నీవు॥)
పొందు సేసి ఇద్దరము పొత్తు గలసినసుద్ది
మందలించె నీపె నాతో మర్మము లెంచి
సుందుసుడిపోలికలో చక్కని నీమతకమో
యెందుకైనా నీకెవచ్చీ నెటువంటి మహిమో
(॥నీవు॥)
పానువుపై మనము నిబ్బరానఁ గూడినరతి
తా నీకె తారుకాణగాఁ దలఁపించీని
పూని తానాడ నుండెనో బోదించఁగా దెలిసెనో
దీననె శ్రీ వేంకటేశ తేటలెల్లమాయను
(||pallavi||)
nīvu nādonaidenu nijamule nĕrabevu
bhāviṁchide nī vŏḽlane pachchiderīm̐ jem̐talu
(||nīvu||)
appuḍu nīvu nenu vāḍugŏnna māḍalĕllā
sĕppĕ nīgĕ nādonu sĕlarem̐gunu
nĕppunam̐ bŏṁchuvinĕno nī vĕruga sesidivo
sŏppulĕtte yīgĕm̐ jūsi sodyamayyī nāgu
(||nīvu||)
pŏṁdu sesi iddaramu pŏttu galasinasuddi
maṁdaliṁchĕ nībĕ nādo marmamu lĕṁchi
suṁdusuḍiboligalo sakkani nīmadagamo
yĕṁdugainā nīgĕvachchī nĕḍuvaṁṭi mahimo
(||nīvu||)
pānuvubai manamu nibbarānam̐ gūḍinaradi
tā nīgĕ tārugāṇagām̐ dalam̐piṁchīni
pūni tānāḍa nuṁḍĕno bodiṁcham̐gā dĕlisĕno
dīnanĕ śhrī veṁkaḍeśha teḍalĕllamāyanu