నీవు మొదల నన్నింటా నెరజాణవు
(॥పల్లవి॥)
నీవు మొదల నన్నింటా నెరజాణవు
పూవువంటిదాన నాతోఁ బొందుసేసే విపుడు
(॥నీవు॥)
చన్ను లంటఁగ వచ్చేవు సరసము లాడేవు
యెన్నిసేసినా నిన్ను నేమనేమయ్యా
సన్న లూరక సేసేవు జవ్వాది మేనఁ బూసేవు
చిన్నదాన నన్నుఁ గాకుసేయ నేఁటికయ్యా
(॥నీవు॥)
ఇట్టె నాపై నొరగేవు యెంగిలి మోవెడిగేవు
బెట్టుగా నీతో నెందాఁకాఁ బెనఁగేమయ్యా
చుట్టి యేకతాలాడేవు సొమ్ములు మేనఁ బెట్టేవు
గుట్టుతోడిదాన నింత గొర బేఁటికయ్యా
(॥నీవు॥)
పచ్చిగాఁ గాఁగిలించేవు పానుపుపైఁ గూడేవు
మచ్చికాయ నీతో నిఁక మరఁగేలయ్యా
కచ్చుక శ్రీవేంకటేశ గందవొడి చల్లేవు
ఇచ్చకురాలఁ గొసరు లిఁక నేఁటికయ్యా
(||pallavi||)
nīvu mŏdala nanniṁṭā nĕrajāṇavu
pūvuvaṁṭidāna nādom̐ bŏṁdusese vibuḍu
(||nīvu||)
sannu laṁṭam̐ga vachchevu sarasamu lāḍevu
yĕnnisesinā ninnu nemanemayyā
sanna lūraga sesevu javvādi menam̐ būsevu
sinnadāna nannum̐ gāguseya nem̐ṭigayyā
(||nīvu||)
iṭṭĕ nābai nŏragevu yĕṁgili movĕḍigevu
bĕṭṭugā nīdo nĕṁdām̐kām̐ bĕnam̐gemayyā
suṭṭi yegadālāḍevu sŏmmulu menam̐ bĕṭṭevu
guṭṭudoḍidāna niṁta gŏra bem̐ṭigayyā
(||nīvu||)
pachchigām̐ gām̐giliṁchevu pānububaim̐ gūḍevu
machchigāya nīdo nim̐ka maram̐gelayyā
kachchuga śhrīveṁkaḍeśha gaṁdavŏḍi sallevu
ichchagurālam̐ gŏsaru lim̐ka nem̐ṭigayyā