Neevu magavaamdavu nerajaana vannidaanu

నీవు మగవాఁడవు నెరజాణ వన్నిటాను
Language

(॥పల్లవి॥)
నీవు మగవాఁడవు నెరజాణ వన్నిటాను
యే విధాన మన్నించినా నియ్యకొనేవారము

(॥నీవు॥)
యెక్కువ తక్కువలై యెటువలె నుండినాను
చక్కనే నీమాఁటలు సబలోనను
వక్కణ లడుగనేల వంకలొత్తి దిద్దనేల
నెక్కొని యాచరితలు నీకే తెలుసును

(॥నీవు॥)
నించిన చలముతోడ నేరిచినా నేరకున్నా
మంచివే నీచేఁతలు మహిమీఁదను
పొంచి యవి చూడనేల పోలిక వెదకనేల
అంచ నట్టైనా నీ కన్నియు నమరును

(॥నీవు॥)
చెంది యెగసక్కేలైనా చిత్తము వచ్చినవైనా
అందములేని నవ్వులు అతివలకు
నిందలేల శ్రీవేంకటనిలయ నన్నేలితివి
కందువ నిదెల్లా నీకుఁ గలిగినగుణము

(||pallavi||)
nīvu magavām̐ḍavu nĕrajāṇa vanniḍānu
ye vidhāna manniṁchinā niyyagŏnevāramu

(||nīvu||)
yĕkkuva takkuvalai yĕḍuvalĕ nuṁḍinānu
sakkane nīmām̐ṭalu sabalonanu
vakkaṇa laḍuganela vaṁkalŏtti diddanela
nĕkkŏni yāsaridalu nīge tĕlusunu

(||nīvu||)
niṁchina salamudoḍa nerisinā neragunnā
maṁchive nīsem̐talu mahimīm̐danu
pŏṁchi yavi sūḍanela poliga vĕdaganela
aṁcha naṭṭainā nī kanniyu namarunu

(||nīvu||)
sĕṁdi yĕgasakkelainā sittamu vachchinavainā
aṁdamuleni navvulu adivalagu
niṁdalela śhrīveṁkaḍanilaya nannelidivi
kaṁduva nidĕllā nīgum̐ galiginaguṇamu