Neevoo maavale manishivani

నీవూ మావలె మనిషివని
Year
Language

పల్లవి:

బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది
అనుకుని ఎలా బ్రతికేది

బాబా సాయి బాబా
బాబా సాయి బాబా

చరణం 1:

నువ్వే మరణించావంటే
ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే మరణించావంటే
ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం
శిధిలంగా అవుతుందా....
పిలిచినంతనే పలికే దైవం
మూగై పోతాడా

బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది
అనుకుని ఎలా బ్రతికేది

బాబా సాయి బాబా
బాబా సాయి బాబా

చరణం 2:

దివిలో వున్నా భువిలో వుండే
మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ వున్నా
ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో వున్నా భువిలో వుండే
మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ వున్నా
ముక్కలు చెక్కలు చేసుకురా

సూర్యచంద్రులను చుక్కల గుంపును
కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళాలిహపర శక్తులు
గగ్గోలెత్తగ రావయ్యా
నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే
ఎందుకు మాకు ఈ లోకం

నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే
ఎందుకు మాకు ఈ లోకం

చరణం 3:

లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ
రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేయనీ
నేనే ఆత్మైతే... నీవే పరమాత్మా....
నీలో నన్ను ఐక్యం ఐపొనీ....పోనీ

pallavi:

bābā sāyi bābā
bābā sāyi bābā
nīvū māvalĕ maniṣhivani
nīgū maraṇaṁ unnadani
aṁṭe ĕlā nammedi
anuguni ĕlā bradigedi

bābā sāyi bābā
bābā sāyi bābā

saraṇaṁ 1:

nuvve maraṇiṁchāvaṁṭe
ā devuḍĕlā bradiguṁṭāḍu
nuvve maraṇiṁchāvaṁṭe
ā devuḍĕlā bradiguṁṭāḍu
nuvve devuḍivaide ā mṛtyuvĕlā śhāsistāḍu
tirugāḍe kovĕla nī dehaṁ
śhidhilaṁgā avuduṁdā....
pilisinaṁtane palige daivaṁ
mūgai podāḍā

bābā sāyi bābā
bābā sāyi bābā
nīvū māvalĕ maniṣhivani
nīgū maraṇaṁ unnadani
aṁṭe ĕlā nammedi
anuguni ĕlā bradigedi

bābā sāyi bābā
bābā sāyi bābā

saraṇaṁ 2:

divilo vunnā bhuvilo vuṁḍe
māgai niṁgini sīlsugurā
dikkulalonā ĕkkaḍa vunnā
mukkalu sĕkkalu sesugurā
divilo vunnā bhuvilo vuṁḍe
māgai niṁgini sīlsugurā
dikkulalonā ĕkkaḍa vunnā
mukkalu sĕkkalu sesugurā

sūryasaṁdrulanu sukkala guṁpunu
kūlsi rālsi rāvayyā
grahamulu goḽālihabara śhaktulu
gaggolĕttaga rāvayyā
nuvvu leguṁṭe nuvvu rāguṁṭe
ĕṁdugu māgu ī logaṁ

nuvvu leguṁṭe nuvvu rāguṁṭe
ĕṁdugu māgu ī logaṁ

saraṇaṁ 3:

layaṁ vachchi prabaṁchamaṁtā nāśhanamaibonī
mullogālu kallolaṁlo śhūnyaṁ ayibonī
ragile kālāgni ĕgise baḍabāgni
daivaṁ dharmānni dagdhaṁ seseyanī
nene ātmaide... nīve paramātmā....
nīlo nannu aikyaṁ aibŏnī....ponī