నీవూ గొన్ని బూటకాలు నెరపే వింతేకాక
(॥పల్లవి॥)
నీవూ గొన్ని బూటకాలు నెరపే వింతేకాక
యీవల నెంతైనా నా యీడుకు రాఁగలవా
(॥నీవూ॥)
అంది వీడె మిచ్చనంటా నాతఁడు మన్నించునంటా
యిందరిలో నీ సుద్దు లేమి చెప్పేవే
గందము నా కిచ్చినాఁడు కాఁగిలించుకున్నాఁడు
మందలించి ఇఁక నీవు మానుపఁగఁగలవా
(॥నీవూ॥)
సన్న సేసెనంటా మోవి చవులు చూపెనంటా
పన్నుక నీ యెమ్మె లెంత పచారించేవే
నన్నుఁ బెండ్లాడినాఁడు నాతో నవ్వుతా నున్నాఁడు
వున్నతి నీ నేరువుల నొద్దనఁగఁగలవా
(॥నీవూ॥)
నిక్కి నిక్కి చూచెనంటా నీపై బత్తిఁగలఁడంటా
వెక్కసాన నీ వెంత విఱ్ఱవీఁగేవా
యిక్కడ శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నేలినాఁడు
చక్క నెలమేల్మంగను సాదించఁగఁగలవా
(||pallavi||)
nīvū gŏnni būḍagālu nĕrabe viṁtegāga
yīvala nĕṁtainā nā yīḍugu rām̐galavā
(||nīvū||)
aṁdi vīḍĕ michchanaṁṭā nādam̐ḍu manniṁchunaṁṭā
yiṁdarilo nī suddu lemi sĕppeve
gaṁdamu nā kichchinām̐ḍu kām̐giliṁchugunnām̐ḍu
maṁdaliṁchi im̐ka nīvu mānubam̐gam̐galavā
(||nīvū||)
sanna sesĕnaṁṭā movi savulu sūbĕnaṁṭā
pannuga nī yĕmmĕ lĕṁta pasāriṁcheve
nannum̐ bĕṁḍlāḍinām̐ḍu nādo navvudā nunnām̐ḍu
vunnadi nī neruvula nŏddanam̐gam̐galavā
(||nīvū||)
nikki nikki sūsĕnaṁṭā nībai battim̐galam̐ḍaṁṭā
vĕkkasāna nī vĕṁta viṭravīm̐gevā
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannelinām̐ḍu
sakka nĕlamelmaṁganu sādiṁcham̐gam̐galavā