Neevichchina saligele nem basaarimtuneppudu

నీవిచ్చిన సలిగెలే నేఁ బచారింతునెప్పుడు
Language

(॥పల్లవి॥)
నీవిచ్చిన సలిగెలే నేఁ బచారింతునెప్పుడు
యీవలె వేరొకటిగా భావించకు విభుఁడా

(॥నీవి॥)
చెంది నన్ను మన్నింతువు చెప్పినట్టే సేతువంటా-
నందరిలో నేనెప్పుడు నాడుకొందును
పందేలాడుదువు సారెఁ బైకొని నవ్వుదువంటా
మందెమేళమున మారుమలయుచునుందును

(॥నీవి॥)
నామొగమే చూతువు నాకే మోహింతువంటా
నీముందర నాయెమ్మెలు నెరపుదును
యేమైనా నాకిత్తువు నన్నెన్నఁడు నెడయఁడంటా
వేమారు మురిపెమున విఱవీఁగుచుందును

(॥నీవి॥)
కడుబత్తిసేతువు కాఁగిటిలోవాఁడవంటా
బడిబడి నీసుద్దులే పచరింతును
కడఁగి శ్రీవేంకటేశ కరుణ నన్నేలితివి
వుడివోనిగర్వమున నోలలాడుచుందును

(||pallavi||)
nīvichchina saligĕle nem̐ basāriṁtunĕppuḍu
yīvalĕ verŏgaḍigā bhāviṁchagu vibhum̐ḍā

(||nīvi||)
sĕṁdi nannu manniṁtuvu sĕppinaṭṭe seduvaṁṭā-
naṁdarilo nenĕppuḍu nāḍugŏṁdunu
paṁdelāḍuduvu sārĕm̐ baigŏni navvuduvaṁṭā
maṁdĕmeḽamuna mārumalayusunuṁdunu

(||nīvi||)
nāmŏgame sūduvu nāge mohiṁtuvaṁṭā
nīmuṁdara nāyĕmmĕlu nĕrabudunu
yemainā nāgittuvu nannĕnnam̐ḍu nĕḍayam̐ḍaṁṭā
vemāru muribĕmuna viṟavīm̐gusuṁdunu

(||nīvi||)
kaḍubattiseduvu kām̐giḍilovām̐ḍavaṁṭā
baḍibaḍi nīsuddule pasariṁtunu
kaḍam̐gi śhrīveṁkaḍeśha karuṇa nannelidivi
vuḍivonigarvamuna nolalāḍusuṁdunu