నీవెఱఁగవా బుద్ది నీకు నేము చెప్పేదేమి
(॥పల్లవి॥)
నీవెఱఁగవా బుద్ది నీకు నేము చెప్పేదేమి
దేవులవు నీ విన్నీఁ దెలిసినవే
(॥నీవె॥)
యెగ్గులు పట్టఁగరాదు యేమాడినా బతితోను
కగ్గి యలుగఁగరాదు గబ్బితనాన
సిగ్గులు వడఁగరాదు చేరి కొంగువట్టితేను
వొగ్గి యిచ్చగించి వూరకుండవలెఁగాని
(॥నీవె॥)
పంతము లాడఁగరాదు బలిమిఁ బెనఁగితేను
వింతలు సేయఁగరాదు వెక్కసానను
చింతఁ దలవంచరాదు చెక్కు నొక్కి వేఁడుకొంటే
సంతోసాన వలపు పైఁ జల్లవలెఁ గాని
(॥నీవె॥)
కసరులు చూపరాదు కాఁగిలించుకొంటేను
పొసఁగక యాఁపరాదు బూటకానను
యెసఁగి శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్ మంగవు
సుసరాన నిన్ను నిక జొక్కవలెఁగాని
(||pallavi||)
nīvĕṟam̐gavā buddi nīgu nemu sĕppedemi
devulavu nī vinnīm̐ dĕlisinave
(||nīvĕ||)
yĕggulu paṭṭam̐garādu yemāḍinā badidonu
kaggi yalugam̐garādu gabbidanāna
siggulu vaḍam̐garādu seri kŏṁguvaṭṭidenu
vŏggi yichchagiṁchi vūraguṁḍavalĕm̐gāni
(||nīvĕ||)
paṁtamu lāḍam̐garādu balimim̐ bĕnam̐gidenu
viṁtalu seyam̐garādu vĕkkasānanu
siṁtam̐ dalavaṁcharādu sĕkku nŏkki vem̐ḍugŏṁṭe
saṁtosāna valabu paim̐ jallavalĕm̐ gāni
(||nīvĕ||)
kasarulu sūbarādu kām̐giliṁchugŏṁṭenu
pŏsam̐gaga yām̐parādu būḍagānanu
yĕsam̐gi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nalamel maṁgavu
susarāna ninnu niga jŏkkavalĕm̐gāni