నీవెంత సిగ్గువడేవు నే నేమనే నిన్ను
(॥పల్లవి॥)
నీవెంత సిగ్గువడేవు నే నేమనే నిన్ను
చేవదేర మేలుసుద్ది చెప్పితి నీకయ్యా
(॥నీవెం॥)
కదిసి యన్నింటాను చక్కనివాఁడవని విని
సుదతి యొక్కతె నిన్నుఁ జూడవచ్చెను
చదురులాడఁగ నీవు జాణఁడవని చెప్పఁగా
అదిగో నీతో మాటలాడ వచ్చెను
(॥నీవెం॥)
నిగిడి రాజనమున నీవు గొలువుండఁగాను
మొగము చూపి యాకె మొక్కవచ్చెను
మిగులాఁ జుట్టరికపు మేనదాననంటాను
తగిలితగిలి నీకుఁ దమి రెఁచ వచ్చెను
(॥నీవెం॥)
యెడమిచ్చి పానుపుపై యేకతాన నుండఁగాను
నడుమ నీతోఁ దానూ నవ్వవచ్చెను
అడరి శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
తడవి నన్నేలఁగాను తాఁ బెండ్లాడవచ్చెను
(||pallavi||)
nīvĕṁta sigguvaḍevu ne nemane ninnu
sevadera melusuddi sĕppidi nīgayyā
(||nīvĕṁ||)
kadisi yanniṁṭānu sakkanivām̐ḍavani vini
sudadi yŏkkadĕ ninnum̐ jūḍavachchĕnu
sadurulāḍam̐ga nīvu jāṇam̐ḍavani sĕppam̐gā
adigo nīdo māḍalāḍa vachchĕnu
(||nīvĕṁ||)
nigiḍi rājanamuna nīvu gŏluvuṁḍam̐gānu
mŏgamu sūbi yāgĕ mŏkkavachchĕnu
migulām̐ juṭṭarigabu menadānanaṁṭānu
tagilidagili nīgum̐ dami rĕm̐sa vachchĕnu
(||nīvĕṁ||)
yĕḍamichchi pānububai yegadāna nuṁḍam̐gānu
naḍuma nīdom̐ dānū navvavachchĕnu
aḍari śhrīveṁkaḍeśha alamelmaṁgabadivi
taḍavi nannelam̐gānu tām̐ bĕṁḍlāḍavachchĕnu