నీవేమి సేతువే నిన్ను నింత సేసిన
(॥పల్లవి॥)
నీవేమి సేతువే నిన్ను నింత సేసిన
భావజుని చెల్లుబడి పంత మింతేకాక
(॥నీవే॥)
మచ్చికలు గెరలఁగా మరి యెంతోరుచుకొన్నా
అచ్చమైన తమకము లడచరావు
పెచ్చురేఁగి కోరికలు పెంటలై పెరుగఁగాను
హెచ్చిన దీమసములు యేడ నుండు నిఁకను
(॥నీవే॥)
తలపోఁత లుండఁగాను తల యెంత వంచుకొన్నా
కులికినవ్వులు దాఁచుకొనఁగరావు
యెలమి నడియాసలు యేరులై వుప్పొంగఁగాను
బలిమిఁ జిరుసిగ్గులపను లెందు కెక్కును
(॥నీవే॥)
జవ్వనము మెఱయఁగా చలమెంత సాదించినా
నివ్వటిల్లు చిత్తము నిలుపరాదు
ఇవ్వల శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁగూడె
రవ్వలైన విరహపురాఁపు లింకేమున్నవి
(||pallavi||)
nīvemi seduve ninnu niṁta sesina
bhāvajuni sĕllubaḍi paṁta miṁtegāga
(||nīve||)
machchigalu gĕralam̐gā mari yĕṁtorusugŏnnā
achchamaina tamagamu laḍasarāvu
pĕchchurem̐gi korigalu pĕṁṭalai pĕrugam̐gānu
hĕchchina dīmasamulu yeḍa nuṁḍu nim̐kanu
(||nīve||)
talabom̐ta luṁḍam̐gānu tala yĕṁta vaṁchugŏnnā
kuliginavvulu dām̐sugŏnam̐garāvu
yĕlami naḍiyāsalu yerulai vuppŏṁgam̐gānu
balimim̐ jirusiggulabanu lĕṁdu kĕkkunu
(||nīve||)
javvanamu mĕṟayam̐gā salamĕṁta sādiṁchinā
nivvaḍillu sittamu nilubarādu
ivvala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐gūḍĕ
ravvalaina virahaburām̐pu liṁkemunnavi