Neevemi seduvayya ne vachchude dosamu

నీవేమి సేతువయ్య నే వచ్చుటే దోసము
Language

(॥పల్లవి॥)
నీవేమి సేతువయ్య నే వచ్చుటే దోసము
ఈ వేళ వెన్నెలగాసీ నిదియే పో దోసము

(॥నీవే॥)
వలచినజవరాల వద్దనఁగ దోసము
కలిగినట్టాడకున్నఁ గడు దోసము
యెలమి నీ యంత నీ వెఱఁగవు దోసము
మలసి యింతనేసినమరునిదే దోసము

(॥నీవే॥)
చెంగటిచెలులు బుద్దిచెప్పనిది దోసము
యింగితపుమతి రాయయినది దోసము
కంగించి రానీనియట్టి కాంతలదే దోసము
బంగార దైవము దయవుట్టించనిదోసము

(॥నీవే॥)
తొట్టినసంపదలతో దొరవైన దోసము
వట్టినేరాలు నిన్నెంచేవారి దోసము
ఇట్టె శ్రీ వేంకటేశ యింతి గూడితివి నేఁడు
తట్టినట్టిందరికి నింతటఁ బాసె దోసము

(||pallavi||)
nīvemi seduvayya ne vachchuḍe dosamu
ī veḽa vĕnnĕlagāsī nidiye po dosamu

(||nīve||)
valasinajavarāla vaddanam̐ga dosamu
kaliginaṭṭāḍagunnam̐ gaḍu dosamu
yĕlami nī yaṁta nī vĕṟam̐gavu dosamu
malasi yiṁtanesinamarunide dosamu

(||nīve||)
sĕṁgaḍisĕlulu buddisĕppanidi dosamu
yiṁgidabumadi rāyayinadi dosamu
kaṁgiṁchi rānīniyaṭṭi kāṁtalade dosamu
baṁgāra daivamu dayavuṭṭiṁchanidosamu

(||nīve||)
tŏṭṭinasaṁpadalado dŏravaina dosamu
vaṭṭinerālu ninnĕṁchevāri dosamu
iṭṭĕ śhrī veṁkaḍeśha yiṁti gūḍidivi nem̐ḍu
taṭṭinaṭṭiṁdarigi niṁtaḍam̐ bāsĕ dosamu