Neevela tittevu nannu nee semtale yimtasese

నీవేల తిట్టేవు నన్ను నీ చేఁతలే యింతసేసె
Language

(॥పల్లవి॥)
నీవేల తిట్టేవు నన్ను నీ చేఁతలే యింతసేసె
వావాత న్నిన్ను దూరఁగవలెనా నాకు

(॥నీవే॥)
కోరి నీమేనిపైనున్నగుఱుతులు చూచికాక
సారె నిన్నునవ్వ నింతచలమా నాకు
వేరే నీవాడేమాటలు వింతలై వుండఁగాఁగాక
కోరి గద్దించి యడుగఁ బోద్దువొదా యేమి

(॥నీవే॥)
అవ్వల నెవ్వతోచీర అంటిమచరాఁగాఁగాక
దవ్వులఁ బెనఁగ దంటతనమా నాకు
నివ్వటిల్ల నన్నీఁజేసి నీవే వేఁడుకోఁగాఁగాక
పవ్వళించి మొక్క నుండఁబట్టదాయేమి

(॥నీవే॥)
పలునారతులలోనే పరాకైవుండఁగాఁగాక
బలిమిఁజన్నులనొత్తఁ బంతమా నాకు
అలరి శ్రీవేంకటేశ అలమేలుమంగ నేనీ-
తలఁపు చూచేఁగాక దారకమా యేమి

(||pallavi||)
nīvela tiṭṭevu nannu nī sem̐tale yiṁtasesĕ
vāvāda nninnu dūram̐gavalĕnā nāgu

(||nīve||)
kori nīmenibainunnaguṟudulu sūsigāga
sārĕ ninnunavva niṁtasalamā nāgu
vere nīvāḍemāḍalu viṁtalai vuṁḍam̐gām̐gāga
kori gaddiṁchi yaḍugam̐ bodduvŏdā yemi

(||nīve||)
avvala nĕvvadosīra aṁṭimasarām̐gām̐gāga
davvulam̐ bĕnam̐ga daṁṭadanamā nāgu
nivvaḍilla nannīm̐jesi nīve vem̐ḍugom̐gām̐gāga
pavvaḽiṁchi mŏkka nuṁḍam̐baṭṭadāyemi

(||nīve||)
palunāradulalone parāgaivuṁḍam̐gām̐gāga
balimim̐jannulanŏttam̐ baṁtamā nāgu
alari śhrīveṁkaḍeśha alamelumaṁga nenī-
talam̐pu sūsem̐gāga dāragamā yemi