నీవేల సిగ్గువడేవే నెలఁతలలో
(॥పల్లవి॥)
నీవేల సిగ్గువడేవే నెలఁతలలో
కావించి యందరికిఁ గలిగిన సాజమే
(॥నీవే॥)
చిగిరించుఁ గోరికలు చిమ్మరేఁగు వలపులు
మగనిపై బత్తిగలమగువకును
మొగానఁ గళలునిండు మునుకొను నాసలు
తగ నిన్నియు నీయందే తారుకాణ వచ్చెనే
(॥నీవే॥)
సెలవుల నవ్వుదేరు చెక్కులఁ జెమటలూరు
తలఁపు పతిపైనున్న తరుణికిని
పులకలు జాజుకొను పొడము నిట్టూరుపులు
కలవెల్లా నీయందే కనుఁగొంటిమే
(॥నీవే॥)
తమకము నుప్పతిలు దైవారు వేడుకలు
రమణుని పొందుగల రామకును
అమర శ్రీవేంకటేశుఁ డాతఁడే నిన్నుఁగూడె
జమళి మియందే ఇవి సరివచ్చెనే
(||pallavi||)
nīvela sigguvaḍeve nĕlam̐talalo
kāviṁchi yaṁdarigim̐ galigina sājame
(||nīve||)
sigiriṁchum̐ gorigalu simmarem̐gu valabulu
maganibai battigalamaguvagunu
mŏgānam̐ gaḽaluniṁḍu munugŏnu nāsalu
taga ninniyu nīyaṁde tārugāṇa vachchĕne
(||nīve||)
sĕlavula navvuderu sĕkkulam̐ jĕmaḍalūru
talam̐pu padibainunna taruṇigini
pulagalu jājugŏnu pŏḍamu niṭṭūrubulu
kalavĕllā nīyaṁde kanum̐gŏṁṭime
(||nīve||)
tamagamu nuppadilu daivāru veḍugalu
ramaṇuni pŏṁdugala rāmagunu
amara śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe ninnum̐gūḍĕ
jamaḽi miyaṁde ivi sarivachchĕne