నీవేల నన్ను నింత నేరమెంచేవు
(॥పల్లవి॥)
నీవేల నన్ను నింత నేరమెంచేవు
మోవితేనియలు చూచి ముందే భ్రమసితి
(॥నీవే॥)
యేమిసేతు నను నీవు యేల యెగ్గువట్టేవు
నామేను చెమరించీ నవ్వఁబోతేను
కోమలపుమేనిదాన కొండుకపాయపుదాన
నీమీఁది మోహమున నేనింత అలసితి
(॥నీవే॥)
నావంక గడమ యేది నన్నేల లోఁచి చూచేవు
చేవఁ బరవశమయ్యీ చెనకితేను
పూవువంటిమతిదాన భోగపురతులదాన
కావరించి నీకుఁగానే కాఁకలు రేఁగితిని
(॥నీవే॥)
నేనెంత నీవెంత నేఁడేల వేఁడుకొనేవు
కానుకగాఁ బులకించి గదిసితేను
అనుక శ్రీవేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
తానకమై నీకొరకు తమకమందింతిని
(||pallavi||)
nīvela nannu niṁta neramĕṁchevu
movideniyalu sūsi muṁde bhramasidi
(||nīve||)
yemisedu nanu nīvu yela yĕgguvaṭṭevu
nāmenu sĕmariṁchī navvam̐bodenu
komalabumenidāna kŏṁḍugabāyabudāna
nīmīm̐di mohamuna neniṁta alasidi
(||nīve||)
nāvaṁka gaḍama yedi nannela lom̐si sūsevu
sevam̐ baravaśhamayyī sĕnagidenu
pūvuvaṁṭimadidāna bhogaburaduladāna
kāvariṁchi nīgum̐gāne kām̐kalu rem̐gidini
(||nīve||)
nenĕṁta nīvĕṁta nem̐ḍela vem̐ḍugŏnevu
kānugagām̐ bulagiṁchi gadisidenu
anuga śhrīveṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
tānagamai nīgŏragu tamagamaṁdiṁtini