Neeve telusugonevu nettana naa gunamellaa

నీవే తెలుసుకొనేవు నెట్టన నా గుణమెల్లా
Language

(॥పల్లవి॥)
నీవే తెలుసుకొనేవు నెట్టన నా గుణమెల్లా
వేవేలు విధాల నిన్ను వేసరించేనా

(॥నీవే॥)
చెలఁగి నీదేవులని చేరి మన్నింతువుగాక
బలిమిచేసి నీకొంగు పట్టితీసేనా
వలపెరిఁగి నీవే నావద్దికి వత్తువుగాక
పెలుచుఁదనాన నిన్నుఁ బిలిపించేనా

(॥నీవే॥)
నీమాట దలఁచుకొని నీవే నన్నేలుటగాక
ఆముకొని పెనఁగి నిన్నలఇంచేనా
చేముట్టి నీ విప్పుడే నా సిగ్గు దేరుతువుగాక
గామిడినై రతి నిన్నుఁ గక్కసించేనా

(॥నీవే॥)
చుట్టరిక మెంచి నన్నుఁజూచి కాఁగిలింతుగాక
నెట్టనఁ గూడవంటాను నేరమెంచేనా
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
జట్టిగొంటి నిఁక నిన్ను సాదించేనా

(||pallavi||)
nīve tĕlusugŏnevu nĕṭṭana nā guṇamĕllā
vevelu vidhāla ninnu vesariṁchenā

(||nīve||)
sĕlam̐gi nīdevulani seri manniṁtuvugāga
balimisesi nīgŏṁgu paṭṭidīsenā
valabĕrim̐gi nīve nāvaddigi vattuvugāga
pĕlusum̐danāna ninnum̐ bilibiṁchenā

(||nīve||)
nīmāḍa dalam̐sugŏni nīve nanneluḍagāga
āmugŏni pĕnam̐gi ninnala̮iṁchenā
semuṭṭi nī vippuḍe nā siggu deruduvugāga
gāmiḍinai radi ninnum̐ gakkasiṁchenā

(||nīve||)
suṭṭariga mĕṁchi nannum̐jūsi kām̐giliṁtugāga
nĕṭṭanam̐ gūḍavaṁṭānu neramĕṁchenā
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
jaṭṭigŏṁṭi nim̐ka ninnu sādiṁchenā