Neeve mamchidanaalu neraba neruduvammaa

నీవే మంచితనాలు నెరప నేరుతువమ్మా
Language

(॥పల్లవి॥)
నీవే మంచితనాలు నెరప నేరుతువమ్మా
సేవసేసి రమణుని చిత్తము వచ్చినట్టు

(॥నీవే॥)
యిచ్చకము లాడితేనే యితవులైయుండు; నౌనె
హెచ్చి వెంగేలాడితేను యియ్యకోలౌనా
అచ్చముగ మొక్కితేను అట్టె దయవుట్టు; నౌనె
విచ్చనవిడిఁ దిట్టతే వేడుకలౌనా

(॥నీవే॥)
మొగమెత్తి చూచితేను మోహములు రేఁగు; నౌనె
తగిలి తలవంచితే తమి వుట్టునా
నగవులు నవ్వితేను ననిచివుండు; నౌనె
బిగిసి వూరకుండితే ప్రియము గలుగునా

(॥నీవే॥)
పాయక పక్కనుండితే భావము గరఁను; నౌనె
చాయల సన్నలవల్లఁ జవి వుట్టునా
చేయార శ్రీవేంకటేశుఁ జెందినది మే; లౌనె
కాయకపు సరసాలు కందువలంటీనా

(||pallavi||)
nīve maṁchidanālu nĕraba neruduvammā
sevasesi ramaṇuni sittamu vachchinaṭṭu

(||nīve||)
yichchagamu lāḍidene yidavulaiyuṁḍu; naunĕ
hĕchchi vĕṁgelāḍidenu yiyyagolaunā
achchamuga mŏkkidenu aṭṭĕ dayavuṭṭu; naunĕ
vichchanaviḍim̐ diṭṭade veḍugalaunā

(||nīve||)
mŏgamĕtti sūsidenu mohamulu rem̐gu; naunĕ
tagili talavaṁchide tami vuṭṭunā
nagavulu navvidenu nanisivuṁḍu; naunĕ
bigisi vūraguṁḍide priyamu galugunā

(||nīve||)
pāyaga pakkanuṁḍide bhāvamu garam̐nu; naunĕ
sāyala sannalavallam̐ javi vuṭṭunā
seyāra śhrīveṁkaḍeśhum̐ jĕṁdinadi me; launĕ
kāyagabu sarasālu kaṁduvalaṁṭīnā