Neeve dayadalamsevu nenu vegirimchanela

నీవే దయదలఁచేవు నేను వేగిరించనేల
Language

(॥పల్లవి॥)
నీవే దయదలఁచేవు నేను వేగిరించనేల
యే విధాననైనా నీకు నిచ్చలాడేనా

(॥నీవే॥)
బలిమి సేయఁగనోప పంతములాడఁగనోప
వలపు నీపైఁ జల్లి వద్ద నుండేను
చలము సాదించనోప సారె వేసరించనోప
యెలమి నీకుఁ జేతులెత్తి మొక్కేను

(॥నీవే॥)
నేరము లెంచఁగనోప నెపములు వేయనోప
మేరతోడనేనవ్వి మెచ్చే నిన్ను
కేరడా లాడఁగనోప కెలసి జంకించనోవ
కూరిమి గొసరి నీకొలువు సేసేను

(॥నీవే॥)
సిగ్గులు వడఁగనోప చితింప మరియోప
యెగ్గులేక నిన్నుఁ గూడి ఇరవయ్యేను
అగ్గలమై శ్రీవేంకటాధిప నన్నేలితివి
వొగ్గి నీమాటల కెల్లా నూఁకొనేను

(||pallavi||)
nīve dayadalam̐sevu nenu vegiriṁchanela
ye vidhānanainā nīgu nichchalāḍenā

(||nīve||)
balimi seyam̐ganoba paṁtamulāḍam̐ganoba
valabu nībaim̐ jalli vadda nuṁḍenu
salamu sādiṁchanoba sārĕ vesariṁchanoba
yĕlami nīgum̐ jedulĕtti mŏkkenu

(||nīve||)
neramu lĕṁcham̐ganoba nĕbamulu veyanoba
meradoḍanenavvi mĕchche ninnu
keraḍā lāḍam̐ganoba kĕlasi jaṁkiṁchanova
kūrimi gŏsari nīgŏluvu sesenu

(||nīve||)
siggulu vaḍam̐ganoba sidiṁpa mariyoba
yĕggulega ninnum̐ gūḍi iravayyenu
aggalamai śhrīveṁkaḍādhiba nannelidivi
vŏggi nīmāḍala kĕllā nūm̐kŏnenu