నీవే బుద్దిచెప్పవయ్య నేననఁ దగవుగాదు
(॥పల్లవి॥)
నీవే బుద్దిచెప్పవయ్య నేననఁ దగవుగాదు
వావాత నింతేసి వఠరఁ జేసితివి
(॥నీవే॥)
నంటు నేసుకొని నీతో నయముననే నవ్వి
గొంటరయాపె యేల కోపగించీని
బంటుబంటుతనమా పడితాళించవచ్చీని
దంటఁ జేసితివి నీవే తరుణి నింతేసి
(॥నీవే॥)
చాయనేసుకొని నీతో సరసములాడితేను
ఆయము లేలె త్తీన అప్పటిఁ దాను
మాయలేల సేసీన మందు మంత్రవాదివలె
గాయగంటి సేసితివి కలికి నింతేసి
(॥నీవే॥)
చవిచేసుకొని నిన్ను సఁ(సం?)గతిగాఁ గూడితేను
అవణించి తానేల ఆసచూపీని
యివల శ్రీవేంకటేళ యే నలమేలుమంగను
జవళి నన్ను నాపె సరవి నేసితివి
(||pallavi||)
nīve buddisĕppavayya nenanam̐ dagavugādu
vāvāda niṁtesi vaṭharam̐ jesidivi
(||nīve||)
naṁṭu nesugŏni nīdo nayamunane navvi
gŏṁṭarayābĕ yela kobagiṁchīni
baṁṭubaṁṭudanamā paḍidāḽiṁchavachchīni
daṁṭam̐ jesidivi nīve taruṇi niṁtesi
(||nīve||)
sāyanesugŏni nīdo sarasamulāḍidenu
āyamu lelĕ ttīna appaḍim̐ dānu
māyalela sesīna maṁdu maṁtravādivalĕ
gāyagaṁṭi sesidivi kaligi niṁtesi
(||nīve||)
savisesugŏni ninnu sam̐(saṁ?)gadigām̐ gūḍidenu
avaṇiṁchi tānela āsasūbīni
yivala śhrīveṁkaḍeḽa ye nalamelumaṁganu
javaḽi nannu nābĕ saravi nesidivi