(॥పల్లవి॥)
నీవనఁగ నేమనఁగ నేరమేకాక
దోవలేని దోవలనుఁ దొక్క నెట్టువచ్చునే
(॥నీవ॥)
కోరిననీకోరికకు గురి గలిగినగాక
ఆరయ నౌఁగాదని యాడవచ్చును
పూరకె బట్టబాయిట నులివచ్చిమాటలను
దూరన గోలలేసినఁ దుద నెందు దాకునే
(॥నీవ॥)
పొసఁగ నీపతిపేరు పొందుగఁ జెప్పినఁగాక
కొసరి బలిమిఁ దోడుకొని వత్తుము
పసపుఁజీరవాని బట్టుమని యాడితేను
దెసల మాబోఁటి కెట్టు దెలియఁగవచ్చునే
(॥నీవ॥)
యిక్కడ శ్రీవేంకటేశుఁ డెనసె నిన్నుఁ జూచి
వొక్కమనసున నింక నుందుముగాక
తెక్కువఁ గడవలోన దీపము ముట్టించిన
దిక్కులఁ దేజములెల్ల దీపించివుండును
(||pallavi||)
nīvanam̐ga nemanam̐ga neramegāga
dovaleni dovalanum̐ dŏkka nĕṭṭuvachchune
(||nīva||)
korinanīgorigagu guri galiginagāga
āraya naum̐gādani yāḍavachchunu
pūragĕ baṭṭabāyiḍa nulivachchimāḍalanu
dūrana golalesinam̐ duda nĕṁdu dāgune
(||nīva||)
pŏsam̐ga nībadiberu pŏṁdugam̐ jĕppinam̐gāga
kŏsari balimim̐ doḍugŏni vattumu
pasabum̐jīravāni baṭṭumani yāḍidenu
dĕsala mābom̐ṭi kĕṭṭu dĕliyam̐gavachchune
(||nīva||)
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ninnum̐ jūsi
vŏkkamanasuna niṁka nuṁdumugāga
tĕkkuvam̐ gaḍavalona dībamu muṭṭiṁchina
dikkulam̐ dejamulĕlla dībiṁchivuṁḍunu