నీవంటివారమే నేము నింతకతొల్లి
(॥పల్లవి॥)
నీవంటివారమే నేము నింతకతొల్లి
లేవమ్మ అందుకేమి లెస్సాయనమ్మా
(॥నీవం॥)
వలపు సిగ్గెఱఁగదు వడి నెట్టివారికైనా
కలిమి వెనకముందు గానరాదు
బలిమి తగవెంచదు పైపై నిందరికి నో -
వెలఁది నీతలనే వేఁగెనటవమ్మా
(॥నీవం॥)
వయసు వెరపెంచునా వాసులే యెక్కించుఁగాక
బయకారికపటము బాసలెంచునా
నయగారిగర్వము వినయమెంచునా యీ -
క్రియలెల్ల నీతలనే కెరలి వచ్చెనటే
(॥నీవం॥)
రతి యలయికెంచునా రారాఁపుచేసుగాక
యితవైన చుట్టరిక మెగ్గులెంచునా
సతిరో శ్రీవేంకటేశు సరుసఁ గూడి నా -
మతి దక్కగొంటివి నీమనసెల్ల వచ్చెనా
(||pallavi||)
nīvaṁṭivārame nemu niṁtagadŏlli
levamma aṁdugemi lĕssāyanammā
(||nīvaṁ||)
valabu siggĕṟam̐gadu vaḍi nĕṭṭivārigainā
kalimi vĕnagamuṁdu gānarādu
balimi tagavĕṁchadu paibai niṁdarigi no -
vĕlam̐di nīdalane vem̐gĕnaḍavammā
(||nīvaṁ||)
vayasu vĕrabĕṁchunā vāsule yĕkkiṁchum̐gāga
bayagārigabaḍamu bāsalĕṁchunā
nayagārigarvamu vinayamĕṁchunā yī -
kriyalĕlla nīdalane kĕrali vachchĕnaḍe
(||nīvaṁ||)
radi yalayigĕṁchunā rārām̐pusesugāga
yidavaina suṭṭariga mĕggulĕṁchunā
sadiro śhrīveṁkaḍeśhu sarusam̐ gūḍi nā -
madi dakkagŏṁṭivi nīmanasĕlla vachchĕnā