Neevamtide kaadaa nettana nem daabe yaasa

నీవంటిదే కాదా నెట్టన నేఁ డాపె యాస
Language

(॥పల్లవి॥)
నీవంటిదే కాదా నెట్టన నేఁ డాపె యాస
దేవులవైతే మరి తెలుసుకోరాదా

(॥నీవం॥)
పతివద్ద నుండినభామనేల పిలిచేవే
కుతిలకుడిచి వట్టి కుచ్చితానను
ఆతని గూడగ నీకు ననువు గావలసితే
వెతదీర నొకతెర వేసుకొనరాదా

(॥నీవం॥)
యింతి విడెమియ్యగాను యేల సన్నచేసేవే
కాంతునిపై నీవు వట్టి కాతరానను
యింతవేడుకైతే నీవు నితనిపచ్చడములో
కాంతకు మఱఁగుగాను కప్పుకొనరాదా

(॥నీవం॥)
పరగఁ దామిద్దరునుఁ బవళించియుండఁగాను
అరసేవేలే వట్టి యాగడానను
గరిమ శ్రీవేంకటేశుఁ గైకొనఁగ మనసైతే
నిరతి నావలిపక్క నీవుండరాదా

(||pallavi||)
nīvaṁṭide kādā nĕṭṭana nem̐ ḍābĕ yāsa
devulavaide mari tĕlusugorādā

(||nīvaṁ||)
padivadda nuṁḍinabhāmanela piliseve
kudilaguḍisi vaṭṭi kuchchidānanu
ādani gūḍaga nīgu nanuvu gāvalaside
vĕdadīra nŏgadĕra vesugŏnarādā

(||nīvaṁ||)
yiṁti viḍĕmiyyagānu yela sannaseseve
kāṁtunibai nīvu vaṭṭi kādarānanu
yiṁtaveḍugaide nīvu nidanibachchaḍamulo
kāṁtagu maṟam̐gugānu kappugŏnarādā

(||nīvaṁ||)
paragam̐ dāmiddarunum̐ bavaḽiṁchiyuṁḍam̐gānu
arasevele vaṭṭi yāgaḍānanu
garima śhrīveṁkaḍeśhum̐ gaigŏnam̐ga manasaide
niradi nāvalibakka nīvuṁḍarādā