Neevamti valabe kaadaa nelamtalagellaanu

నీవంటి వలపే కాదా నెలఁతలకెల్లాను
Language

(॥పల్లవి॥)
నీవంటి వలపే కాదా నెలఁతలకెల్లాను
కావరించి సవతులఁ గాకు సేతురా

(॥నీవం॥)
రవ్వలేలసేసేరే రమణుని తోడత
అవ్వల నెవ్వతో మొక్కె నాతనికంటా
యివ్వలఁ గొలువులు నీ వితనికిఁ జేసేవేళ
నివ్వటిల్ల నాపెవచ్చి నిన్ను వెంగె చూడెనా

(॥నీవం॥)
పంతములేలాడేవే పైకొని నీ వితనికి-
నింతలో నెవ్వతో విడెమిచ్చె నంటాను
కాంతపు నీ వితనికిఁ గాఁపురము సేసేవేళ
మంతనాన నాకె నీతో మచ్చరించ వచ్చెనా

(॥నీవం॥)
సెలవినేల నవ్వేవే శ్రీవేంకటేశ్వరుని
లలి నెవ్వతో యీతని లాలించెనంటా
కులికి మీ రిద్దరునుఁ గూడి రతిసేసేవేళ
చెలఁగి యాపె మిమ్ము సిగ్గులు వరచెనా

(||pallavi||)
nīvaṁṭi valabe kādā nĕlam̐talagĕllānu
kāvariṁchi savadulam̐ gāgu sedurā

(||nīvaṁ||)
ravvalelasesere ramaṇuni toḍada
avvala nĕvvado mŏkkĕ nādanigaṁṭā
yivvalam̐ gŏluvulu nī vidanigim̐ jeseveḽa
nivvaḍilla nābĕvachchi ninnu vĕṁgĕ sūḍĕnā

(||nīvaṁ||)
paṁtamulelāḍeve paigŏni nī vidanigi-
niṁtalo nĕvvado viḍĕmichchĕ naṁṭānu
kāṁtabu nī vidanigim̐ gām̐puramu seseveḽa
maṁtanāna nāgĕ nīdo machchariṁcha vachchĕnā

(||nīvaṁ||)
sĕlavinela navveve śhrīveṁkaḍeśhvaruni
lali nĕvvado yīdani lāliṁchĕnaṁṭā
kuligi mī riddarunum̐ gūḍi radiseseveḽa
sĕlam̐gi yābĕ mimmu siggulu varasĕnā