నీవల్ల నింతేసి నివ్వెరగందితి
(॥పల్లవి॥)
నీవల్ల నింతేసి నివ్వెరగందితి
చేవల్లకు రావే చెప్పేను నేను
(॥నీవ॥)
కొప్పు దువ్వఁగాను గోరుదాఁకెఁ జెక్కు
యెప్పుడు నవ్వఁగ నేమిటికి
చిప్పిలఁగా నీవు జీరదీసితివో
చెప్పఁగదే భ్రమసితి నేను
(॥నీవ॥)
పలుకఁగాను నాపల్లు దాఁకె మోవి
యెలయించి నవ్వనేమిటికి
నిలిచి యీచేఁత నీవు సేసితివో
తలఁపించవే కొత్తలైతి నేను
(॥నీవ॥)
సరసమాడఁగాను సందిసొమ్ము లొత్తె
యిరవయితి నవ్వనేమిటికి
సరి శ్రీవేంకటేశ్వరుఁడను నా
వుర మెక్కితిని వొప్పితి నేను
(||pallavi||)
nīvalla niṁtesi nivvĕragaṁdidi
sevallagu rāve sĕppenu nenu
(||nīva||)
kŏppu duvvam̐gānu gorudām̐kĕm̐ jĕkku
yĕppuḍu navvam̐ga nemiḍigi
sippilam̐gā nīvu jīradīsidivo
sĕppam̐gade bhramasidi nenu
(||nīva||)
palugam̐gānu nāballu dām̐kĕ movi
yĕlayiṁchi navvanemiḍigi
nilisi yīsem̐ta nīvu sesidivo
talam̐piṁchave kŏttalaidi nenu
(||nīva||)
sarasamāḍam̐gānu saṁdisŏmmu lŏttĕ
yiravayidi navvanemiḍigi
sari śhrīveṁkaḍeśhvarum̐ḍanu nā
vura mĕkkidini vŏppidi nenu