నీవైనా విన్నవించవే నిఘ్టారము గాకుండాను
(॥పల్లవి॥)
నీవైనా విన్నవించవే నిఘ్టారము గాకుండాను
తావుకొన్న మొగమోట తఱచు నా కిపుడు
(॥నీవై॥)
చెప్పఁజాలఁగాక తానుసిగ్గువడీనంటగాను
అప్పటనుండి నందరు నాడేమాటలు
తప్పనిబొంకనియట్టిదంటయై తానున్నాఁడు
వొప్పుగ నే వెరగంది వుందాననే యిపుడు
(॥నీవై॥)
మందలించఁజాలఁగాక మనసు నొచ్చీనంటాను
గొందిసంది తనమేనిగురుతులెల్లా
చందాలు సేసుక ఇట్టె సాదువలె నున్నాఁడు
అందుకే నే నవ్వి నవ్వి యలసితి నిపుడు
(॥నీవై॥)
యెచ్చరించఁజాలఁగాక ఇంతలో లోఁగీనంటా
రచ్చలకెక్కినతనరతులెల్లాను
అచ్చపు శ్రీవేంకటేశుఁడల మేలుమంగక నేను
మచ్చికతోఁ దన్ను గూడి మరిగితి నిపుడు
(||pallavi||)
nīvainā vinnaviṁchave nighṭāramu gāguṁḍānu
tāvugŏnna mŏgamoḍa taṟasu nā kibuḍu
(||nīvai||)
sĕppam̐jālam̐gāga tānusigguvaḍīnaṁṭagānu
appaḍanuṁḍi naṁdaru nāḍemāḍalu
tappanibŏṁkaniyaṭṭidaṁṭayai tānunnām̐ḍu
vŏppuga ne vĕragaṁdi vuṁdānane yibuḍu
(||nīvai||)
maṁdaliṁcham̐jālam̐gāga manasu nŏchchīnaṁṭānu
gŏṁdisaṁdi tanamenigurudulĕllā
saṁdālu sesuga iṭṭĕ sāduvalĕ nunnām̐ḍu
aṁduge ne navvi navvi yalasidi nibuḍu
(||nīvai||)
yĕchchariṁcham̐jālam̐gāga iṁtalo lom̐gīnaṁṭā
rachchalagĕkkinadanaradulĕllānu
achchabu śhrīveṁkaḍeśhum̐ḍala melumaṁgaga nenu
machchigadom̐ dannu gūḍi marigidi nibuḍu