Neesittamu naabhaagyamu neevettayinaam jeyi

నీచిత్తము నాభాగ్యము నీవెట్టయినాఁ జేయి
Language

(॥పల్లవి॥)
నీచిత్తము నాభాగ్యము నీవెట్టయినాఁ జేయి
కాచుకున్నదాన నీకుఁ గరుణించు మిఁకను

(॥నీచి॥)
మనసురాని యట్టిమాట లెన్నియాడినాను
పనిమాలుటేకాని బాఁతి గావు
తనివిలేనియట్టితమక మెంతవెంచినా
పెనఁగులాటకునుఁబెట్ట కేల మానును

(॥నీచి॥)
సెలవుగానియట్టిచేఁత లెన్ని సేసినాను
ఆలమటలేకాని యందము గావు
వలవనికోరికలు వాములెంత వేసుకొన్నా
తలకొన్న వలపులు తనియనేలిచ్చును

(॥నీచి॥)
ఆయముసోఁకనినవ్వు లవి యెంతనవ్వినాను
కాయకములేకాని కళ దాఁకదు
పాయపుటలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడ
యీయెడ నన్నేలితివి యిఁక నిన్ను మెత్తును

(||pallavi||)
nīsittamu nābhāgyamu nīvĕṭṭayinām̐ jeyi
kāsugunnadāna nīgum̐ garuṇiṁchu mim̐kanu

(||nīsi||)
manasurāni yaṭṭimāḍa lĕnniyāḍinānu
panimāluḍegāni bām̐ti gāvu
tanivileniyaṭṭidamaga mĕṁtavĕṁchinā
pĕnam̐gulāḍagunum̐bĕṭṭa kela mānunu

(||nīsi||)
sĕlavugāniyaṭṭisem̐ta lĕnni sesinānu
ālamaḍalegāni yaṁdamu gāvu
valavanigorigalu vāmulĕṁta vesugŏnnā
talagŏnna valabulu taniyanelichchunu

(||nīsi||)
āyamusom̐kaninavvu lavi yĕṁtanavvinānu
kāyagamulegāni kaḽa dām̐kadu
pāyabuḍalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍa
yīyĕḍa nannelidivi yim̐ka ninnu mĕttunu