నీచేఁతలోనిదాన నిన్ను వేఁడుకొనే నిదె
(॥పల్లవి॥)
నీచేఁతలోనిదాన నిన్ను వేఁడుకొనే నిదె
కాచెఁ బూచెఁ గోరికలు కలపకు సిగ్గులు
(॥నీచే॥)
నవ్వులు నే నవ్వితేను నన్నేల యానవెట్టేవు
చివ్వన మతిలో మాఁట చెప్పుమనుచును
వువ్విళ్ళూరించకుమంత వొద్దు దోసము లేదను
జవ్వనము సరిదాఁకె సాదించకు చలము
(॥నీచే॥)
సరసములాడితేను సరిఁ గొంగేల పట్టేవు
తరవాతఁ గొనగోరు దాఁకెననుచు
గొరబుసేయకు మమ్ము గుట్టున నుండఁగనిమ్ము
దొరతనము లీడేరె తొక్కకు నాపాదము
(॥నీచే॥)
మొగము నేఁ జూచితేను మొక్కులేల మొక్కేవు
సగటుఁ గూరిములు పైఁబా ననుచు
అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
బిగువుఁగాఁగిలి నిట్టె పిసుకకు చన్నులు
(||pallavi||)
nīsem̐talonidāna ninnu vem̐ḍugŏne nidĕ
kāsĕm̐ būsĕm̐ gorigalu kalabagu siggulu
(||nīse||)
navvulu ne navvidenu nannela yānavĕṭṭevu
sivvana madilo mām̐ṭa sĕppumanusunu
vuvviḽḽūriṁchagumaṁta vŏddu dosamu ledanu
javvanamu saridām̐kĕ sādiṁchagu salamu
(||nīse||)
sarasamulāḍidenu sarim̐ gŏṁgela paṭṭevu
taravādam̐ gŏnagoru dām̐kĕnanusu
gŏrabuseyagu mammu guṭṭuna nuṁḍam̐ganimmu
dŏradanamu līḍerĕ tŏkkagu nābādamu
(||nīse||)
mŏgamu nem̐ jūsidenu mŏkkulela mŏkkevu
sagaḍum̐ gūrimulu paim̐bā nanusu
agabaḍi śhrīveṁkaḍādhiba nannelidivi
biguvum̐gām̐gili niṭṭĕ pisugagu sannulu