Neesedamgaani kaadu nettana neebanulella

నీచేతఁగాని కాదు నెట్టన నీపనులెల్ల
Language

(॥పల్లవి॥)
నీచేతఁగాని కాదు నెట్టన నీపనులెల్ల
వాచవి తన సుద్దులు వద్దనఁగరాదా

(॥నీచే॥)
నాతోడి వరుసదా నాతోడి వంతులదా
యేతులకు నీతో మేల మేల ఆడీని
చేతులు నేఁ జాఁచినాను సిగ్గువడ నేరఁడు
పోతరపు మగఁడవు బుద్ది చెప్పరాదా

(॥నీచే॥)
నేనెంత దా నెంత నేరుపు దన కేడది
నానఁబెట్టి నీతో నేల నవ్వు నవ్వీని
సానఁబట్టి నేఁ జూచితే సన్నకు మేలెఱఁగదు
పూనుకవచ్చి నీవైనా బుద్ది చెప్పరాదా

(॥నీచే॥)
పెండ్లాడినదా నిన్ను పేరటమాపె యింతే
యిండ్లు దా దొంగిచూడనిది యేఁటికి
కండ్లనే జంకించితి గక్కన శ్రీ వేంకటేశ
ఆండ్లుగల పతిని ఆపె ననరాదా

(||pallavi||)
nīsedam̐gāni kādu nĕṭṭana nībanulĕlla
vāsavi tana suddulu vaddanam̐garādā

(||nīse||)
nādoḍi varusadā nādoḍi vaṁtuladā
yedulagu nīdo mela mela āḍīni
sedulu nem̐ jām̐sinānu sigguvaḍa neram̐ḍu
podarabu magam̐ḍavu buddi sĕpparādā

(||nīse||)
nenĕṁta dā nĕṁta nerubu dana keḍadi
nānam̐bĕṭṭi nīdo nela navvu navvīni
sānam̐baṭṭi nem̐ jūside sannagu melĕṟam̐gadu
pūnugavachchi nīvainā buddi sĕpparādā

(||nīse||)
pĕṁḍlāḍinadā ninnu peraḍamābĕ yiṁte
yiṁḍlu dā dŏṁgisūḍanidi yem̐ṭigi
kaṁḍlane jaṁkiṁchidi gakkana śhrī veṁkaḍeśha
āṁḍlugala padini ābĕ nanarādā