నీమీఁద బత్తిగలఁడు మీ రమణుఁడు
(॥పల్లవి॥)
నీమీఁద బత్తిగలఁడు మీ రమణుఁడు
ఆముకొన్న చేఁతలు నీ కమరునే నేఁడు
(॥నీమీఁ॥)
సెలవి నవ్వులముగ్గు చిప్పిలుగళలనిగ్గు
కలికి కన్నులకెంపు కాయముసొంపు
పలుకుదేనెలసోన పరగుఁ జెమటవాన
అలివేణి నీకు నిన్నీ నమరునే నేఁడు
(॥నీమీఁ॥)
ముక్కున అసురుసు మోహపు ముద్దుఁగొసరు
జక్కవ చన్నులతీరు సరాలపేరు
చెక్కిటి జవ్వాదిరంగు జీరేటిపయ్యెదకొంగు
అక్కరో నీసింగార మమరునే నేఁడు
(॥నీమీఁ॥)
కొప్పుపై ముత్తేలసేస గుబ్బతిలే యడియాస
వొప్పయిన తెరచాటు వుండేటి నీటు
ముప్పిరిఁ గాఁగిట నించి ముంచి శ్రీవేంకటగిరి -
యప్పఁడేలె నిన్ని నీకు నమరునే నేఁడు
(||pallavi||)
nīmīm̐da battigalam̐ḍu mī ramaṇum̐ḍu
āmugŏnna sem̐talu nī kamarune nem̐ḍu
(||nīmīm̐||)
sĕlavi navvulamuggu sippilugaḽalaniggu
kaligi kannulagĕṁpu kāyamusŏṁpu
palugudenĕlasona paragum̐ jĕmaḍavāna
aliveṇi nīgu ninnī namarune nem̐ḍu
(||nīmīm̐||)
mukkuna asurusu mohabu muddum̐gŏsaru
jakkava sannuladīru sarālaberu
sĕkkiḍi javvādiraṁgu jīreḍibayyĕdagŏṁgu
akkaro nīsiṁgāra mamarune nem̐ḍu
(||nīmīm̐||)
kŏppubai muttelasesa gubbadile yaḍiyāsa
vŏppayina tĕrasāḍu vuṁḍeḍi nīḍu
muppirim̐ gām̐giḍa niṁchi muṁchi śhrīveṁkaḍagiri -
yappam̐ḍelĕ ninni nīgu namarune nem̐ḍu