Neelaala nimgi oga saari vamgi

నీలాల నింగి ఒక సారి వంగి
Work
Year
Language

పల్లవి:

నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

నీలాల నింగి ఒకసారి వంగి
నీలాల నింగి ఒకసారి వంగి
అద్దాల చెక్కిలి ముద్దాడిపోతే
అదే అచ్చట అదే ముచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా

చరణం 1:

పయనించు మేఘాలు పయనాలు ఆపి
చిరునవ్వు నవ్వి చిరుజల్లు చల్లి
కదలి వెడలిపోతే అదే ముచ్చట
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సెలయేటి పరవళ్ళు కాసేపు ఆగి
సిగ్గుల్లో నిన్ను మైకంలో నన్ను
చూసి చూడలేక ఉండీ ఉండలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా (నీలాల నింగి)

చరణం 2:

నిదురించు అందాలు ఒకసారి లేచి
పైపైకి వచ్చి పరువాలు చూసి
నిదుర మరచిపోతే అదే ముచ్చట
లోలోని కోరికలు లోకాలు మరిచి
లోలోని కోరికలు లోకాలు మరిచి
కళ్ళల్లో నిన్ను కౌగిళ్ళో నన్ను
ఉంచీ ఉంచలేక వదలీ వదలలేక
కదలి వెడలిపోతే అదే ముచ్చట అదే అచ్చట
అదే ముచ్చట అదే అచ్చట ఈ జన్మకంతా (నీలాల్ నింగి)

pallavi:

nīlāla niṁgi ŏgasāri vaṁgi
nīlāla niṁgi ŏgasāri vaṁgi
addāla sĕkkili muddāḍibode
ade achchaḍa ade muchchaḍa
ade muchchaḍa ade achchaḍa ī janmagaṁtā

nīlāla niṁgi ŏgasāri vaṁgi
nīlāla niṁgi ŏgasāri vaṁgi
addāla sĕkkili muddāḍibode
ade achchaḍa ade muchchaḍa
ade muchchaḍa ade achchaḍa ī janmagaṁtā

saraṇaṁ 1:

payaniṁchu meghālu payanālu ābi
sirunavvu navvi sirujallu salli
kadali vĕḍalibode ade muchchaḍa
sĕlayeḍi paravaḽḽu kāsebu āgi
sĕlayeḍi paravaḽḽu kāsebu āgi
siggullo ninnu maigaṁlo nannu
sūsi sūḍalega uṁḍī uṁḍalega
kadali vĕḍalibode ade muchchaḍa ade achchaḍa
ade muchchaḍa ade achchaḍa ī janmagaṁtā (nīlāla niṁgi)

saraṇaṁ 2:

niduriṁchu aṁdālu ŏgasāri lesi
paibaigi vachchi paruvālu sūsi
nidura marasibode ade muchchaḍa
loloni korigalu logālu marisi
loloni korigalu logālu marisi
kaḽḽallo ninnu kaugiḽḽo nannu
uṁchī uṁchalega vadalī vadalalega
kadali vĕḍalibode ade muchchaḍa ade achchaḍa
ade muchchaḍa ade achchaḍa ī janmagaṁtā (nīlāl niṁgi)