Neela gagana ghanashyaamaa

నీల గగన ఘనశ్యామా
Year
Language

పల్లవి:

నీలగగనఘనశ్యామా ...ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా
నీలగగనఘనశ్యామా ...దేవ నీలగగనఘనశ్యామా
హాని కలిగితే అవతారాలను....
హాని కలిగితే అవతారాలను... పూని బ్రోచునది నీవే కావా

నీలగగనఘనశ్యామా...
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా

చరణం 1:

చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా..
చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూపా
వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా...

నీలగగనఘనశ్యామా....
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా

చరణం 2:

కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి...
కడలి మధించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి..
అతివ రూపమున అమృతము గాచిన ఆదిదేవుడవు నీవే కావా...

నీలగగనఘనశ్యామా....
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ నీలగగనఘనశ్యామా

చరణం 3:

సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము...
సుజనుల కోసము ఎపుడే వేషము ధరియించెదవో తెలియగనేరము..
పెండ్లికొడుకువై వెడలి నాడవు ఎందుల కొరకో... హే! జగదీశా...

నీలగగనఘనశ్యామా...
నీలగగనఘనశ్యామా... ఘనశ్యామా దేవ... నీలగగనఘనశ్యామా

pallavi:

nīlagaganaghanaśhyāmā ...ghanaśhyāmā deva nīlagaganaghanaśhyāmā
nīlagaganaghanaśhyāmā ...deva nīlagaganaghanaśhyāmā
hāni kaligide avadārālanu....
hāni kaligide avadārālanu... pūni brosunadi nīve kāvā

nīlagaganaghanaśhyāmā...
nīlagaganaghanaśhyāmā... ghanaśhyāmā deva nīlagaganaghanaśhyāmā

saraṇaṁ 1:

saduvulu hariṁchi asuruṁḍegina jalasaramaidivi āgamarūbā..
saduvulu hariṁchi asuruṁḍegina jalasaramaidivi āgamarūbā
veda nidhulane vidhāda kŏsagina ādidevuḍavu nīve kāvā...

nīlagaganaghanaśhyāmā....
nīlagaganaghanaśhyāmā... ghanaśhyāmā deva nīlagaganaghanaśhyāmā

saraṇaṁ 2:

kaḍali madhiṁchaga kadile nagamunu vĕḍali kūrmamai vībuna mosi...
kaḍali madhiṁchaga kadile nagamunu vĕḍali kūrmamai vībuna mosi..
adiva rūbamuna amṛtamu gāsina ādidevuḍavu nīve kāvā...

nīlagaganaghanaśhyāmā....
nīlagaganaghanaśhyāmā... ghanaśhyāmā deva nīlagaganaghanaśhyāmā

saraṇaṁ 3:

sujanula kosamu ĕbuḍe veṣhamu dhariyiṁchĕdavo tĕliyaganeramu...
sujanula kosamu ĕbuḍe veṣhamu dhariyiṁchĕdavo tĕliyaganeramu..
pĕṁḍligŏḍuguvai vĕḍali nāḍavu ĕṁdula kŏrago... he! jagadīśhā...

nīlagaganaghanaśhyāmā...
nīlagaganaghanaśhyāmā... ghanaśhyāmā deva... nīlagaganaghanaśhyāmā