నీకు వేడుకైతేఁ జాలు నే మెట్టయినా నుండేము
(॥పల్లవి॥)
నీకు వేడుకైతేఁ జాలు నే మెట్టయినా నుండేము
యే కడ చూచిన నీవే యేలవయ్య రాజ్యము
(॥నీకు॥)
తీపులు వుట్టించి నీవు తేరి సన్నలు సేయఁగ
కోపాలు రేఁగకుండునా కొమ్మలకు
ఆపె నేను యేమి సేతు మాడువార మెఱఁగము
యేపున నింతేసి సేసి యేలవయ్య రాజ్యము
(॥నీకు॥)
ఆసలు రేఁచి నీవు అసము లిచ్చి నవ్వఁగ
వాసులు వుట్ట కుండునా వనితలకు
వోసరించదాపె, నేను వోరువఁజాల నిందుకు
నీసరి నిద్దరివంక యేలవయ్య రాజ్యము
(॥నీకు॥)
మలసి కొంగులువట్టి మంచముపైకిఁ దియ్యఁగ
కళలు వుట్టకుండునా కాంతలకు
యెలమి శ్రీ వేంకటేశ యెనసితివి మమ్మును
యెలయించి యెలయించి యేలవయ్య రాజ్యము
(||pallavi||)
nīgu veḍugaidem̐ jālu ne mĕṭṭayinā nuṁḍemu
ye kaḍa sūsina nīve yelavayya rājyamu
(||nīgu||)
tībulu vuṭṭiṁchi nīvu teri sannalu seyam̐ga
kobālu rem̐gaguṁḍunā kŏmmalagu
ābĕ nenu yemi sedu māḍuvāra mĕṟam̐gamu
yebuna niṁtesi sesi yelavayya rājyamu
(||nīgu||)
āsalu rem̐si nīvu asamu lichchi navvam̐ga
vāsulu vuṭṭa kuṁḍunā vanidalagu
vosariṁchadābĕ, nenu voruvam̐jāla niṁdugu
nīsari niddarivaṁka yelavayya rājyamu
(||nīgu||)
malasi kŏṁguluvaṭṭi maṁchamubaigim̐ diyyam̐ga
kaḽalu vuṭṭaguṁḍunā kāṁtalagu
yĕlami śhrī veṁkaḍeśha yĕnasidivi mammunu
yĕlayiṁchi yĕlayiṁchi yelavayya rājyamu