నీకు నిచ్చకమాడ నేర్తుఁగాక । యిట్లఁ
(॥పల్లవి॥)
నీకు నిచ్చకమాడ నేర్తుఁగాక । యిట్లఁ
గాక నీ కెదురాడఁగలనా నేను
(॥నీకు॥)
చలివిడిచి నాయకుని సాదించుఁ గడు నొకతె
అలరి తను నెడసితే నలుగు నొకతె
వొలసి నొల్లమియైన వొగిఁ గోపగించు నొకతె
నిలిచి ఇంతటిపనికి నేర్తునా నేను
(॥నీకు॥)
సరవిఁ దప్పక విభుని జంకించుఁ గడు నొకతె
సరసంబులాడితే జఱయు నొకతె
వరుస వంతెడలినను వాదించు మరి యొకతె
పరగ నింతేసి కొడఁబడుదునా నేను
(॥నీకు॥)
అంకపురతుల లోన నలయించుఁ బతి నొకతె
మంకుమర్మపుఁగళల మఱచు నొకతె
ఇంకేల శ్రీవేంకటేశ కూడితివి నను
వుంకువల వెనకఁ దడవుదునా నేను
(||pallavi||)
nīgu nichchagamāḍa nerdum̐gāga | yiṭlam̐
gāga nī kĕdurāḍam̐galanā nenu
(||nīgu||)
saliviḍisi nāyaguni sādiṁchum̐ gaḍu nŏgadĕ
alari tanu nĕḍaside nalugu nŏgadĕ
vŏlasi nŏllamiyaina vŏgim̐ gobagiṁchu nŏgadĕ
nilisi iṁtaḍibanigi nerdunā nenu
(||nīgu||)
saravim̐ dappaga vibhuni jaṁkiṁchum̐ gaḍu nŏgadĕ
sarasaṁbulāḍide jaṟayu nŏgadĕ
varusa vaṁtĕḍalinanu vādiṁchu mari yŏgadĕ
paraga niṁtesi kŏḍam̐baḍudunā nenu
(||nīgu||)
aṁkaburadula lona nalayiṁchum̐ badi nŏgadĕ
maṁkumarmabum̐gaḽala maṟasu nŏgadĕ
iṁkela śhrīveṁkaḍeśha kūḍidivi nanu
vuṁkuvala vĕnagam̐ daḍavudunā nenu