నీకు నంకెవచ్చితే నీవు మానేవా
(॥పల్లవి॥)
నీకు నంకెవచ్చితే నీవు మానేవా
యే కడఁ జూచిన సరే యిద్దరికి నెపుడు
(॥నీకు॥)
పతుల మోహింపించేది పంతములు మెరసేది
సతుల కెప్పుడు నివి సహజములే
రతికిఁ బెనఁగుదురు రాకుండితే జంకింతురు
హితవై కైకొంటగాక యేలయ్య కోపము
(॥నీకు॥)
చలివాసి నవ్వేది సరసములాడేది
కలికికాంతలకుఁ గలగుణమే
పిలుతురు బిగుతురు ప్రియములు చెప్పుదురు
నెలకొని యిందుకుఁగా నీకేల చలము
(॥నీకు॥)
మొక్కి మొక్కి కూడేది మోవి గంటిసేసేది
చక్కనిసతుల కివి చందములే
యెక్కువ శ్రీవేంకటేశ యిటు నీవే కూడితివి
మక్కళించి మక్కళించి మఱి యాల కొసరు
(||pallavi||)
nīgu naṁkĕvachchide nīvu mānevā
ye kaḍam̐ jūsina sare yiddarigi nĕbuḍu
(||nīgu||)
padula mohiṁpiṁchedi paṁtamulu mĕrasedi
sadula kĕppuḍu nivi sahajamule
radigim̐ bĕnam̐guduru rāguṁḍide jaṁkiṁturu
hidavai kaigŏṁṭagāga yelayya kobamu
(||nīgu||)
salivāsi navvedi sarasamulāḍedi
kaligigāṁtalagum̐ galaguṇame
piluduru biguduru priyamulu sĕppuduru
nĕlagŏni yiṁdugum̐gā nīgela salamu
(||nīgu||)
mŏkki mŏkki kūḍedi movi gaṁṭisesedi
sakkanisadula kivi saṁdamule
yĕkkuva śhrīveṁkaḍeśha yiḍu nīve kūḍidivi
makkaḽiṁchi makkaḽiṁchi maṟi yāla kŏsaru